జాతీయ వార్తలు

నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సింధూ ప్రొవిన్స్‌లో ఇద్దరు హిందూ మతానికి చెందిన బాలికలను కిడ్నాప్ చేసి మత మార్పిడులకు పాల్పడిన ఉదంతంపై భారత్, పాక్‌ల మధ్య వివాదం తలెత్తింది. ఇరు దేశాల మంత్రులు తీవ్రస్థాయిలో ఈ అంశంపై మాటల యుద్ధానికి దిగారు. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్‌లో మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పాకిస్తాన్‌లో భారత్ రాయబారి అజయ్ బిసారియా నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా సుష్మాస్వరాజ్ ట్వీట్ అర్థరహితమని పాక్ సమాచార శాఖ మంత్రి ఫావడ్ చౌదరి తోసిపుచ్చారు. ‘ఇది మా అంతరంగిక వ్యవహారం. ఇదేమీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌లో భాగం కాదు. భారత్‌లో మైనార్టీల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మాది ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో కొత్త పాకిస్తాన్. ఇక్కడ అందరూ సమానమే అని అన్నారు. భారత్‌లో మైనార్టీ హక్కుల పట్ల కూడా ఇంతే శ్రద్ధతో ఉండండి అని ఆయన అన్నారు. దీనికి సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను ఈ ఘటనపై నివేదిక మాత్రమే తమ రాయబారిని అడిగానని ఆమె చెప్పారు. ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషనర్ ఉన్నారని చెప్పారు. ఇద్దరు హిందూబాలికలను బలవంతంగా కిడ్నాప్ చేసి మతమార్పిడులకు పాల్పడిన ఘటన గురించి మాత్రమే అడిగాం అని ఆమె చెప్పారు. ఈ ఘటన వల్ల మీ పరిస్థితి ఏమిటో తెలిసింది. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు.
సింధ్ రాష్ట్రంలో గోట్కీ జిల్లాలో హోలీ పండగ రోజు స్థానికంగా పలుకుబడి ఉన్న యువకులు కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మతమార్పిడులు చేసిన ఘటన వీడియో వైరల్ అయింది. ఇందులో ఒక ఖాజీ హిందూ బాలికల చేత మతం మార్చుకుంటున్నట్లుగా ప్రార్థనలు చేయించారు. వారికి నిఖా ( వివాహం ) కూడా జరిపించినట్లు ఉంది. తమ మనసుకు అనుగుణంగానే మతం మార్చుకుంటున్నట్లు ఆ బాలికలు చెమప్పారు. ఇవన్నీ వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనపై స్థానిక హిందువులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఉర్దూలో ట్వీట్ చేసిన పాక్‌మంత్రి చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి వెంటనే స్పందించారని, విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని సింధ్ సీఎంను ఆదేశించారు. ఈ బాలికలు పంజాబ్‌లోని రహీం యార్ ఖాన్ కు చెందిన వారని చెప్పారు. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్‌లో మైనార్టీ హిందువుల దుస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో ధ్వజమెత్తుతోంది.
మతమార్పిడుల ఉదంతంపై నివేదిక కోరిన ప్రధాని ఇమ్రాన్
ఇరుదేశాల మధ్య మరోసారి వివాదస్పదంగా మారిన పాక్‌లో హిందూబాలికల మతమార్పిడిల ఘటనపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ విచారణకు ఆదేశించారు. ఈ బాలికల పేర్లు రవీనా (13), రీనా (15). ఈ ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా పాకిస్తాన్‌లో దేశ వ్యాప్తంగా హిందువులు ఆందోళనకు దిగారు. గత ఏడాది ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తామనిహామీ ఇచ్చారు. పాకిస్తాన్ హిందూసేవా సంక్షేమ ట్రస్టు అధ్యక్షుడు సంజేష్ ధంజా మాట్లాడుతూ దేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నారని చెప్పడం కాని ఆచరణలో చూపించాలన్నారు. హిందూ బాలికలను వేధించి వారిని మతమార్పిడులకు గురి చేయడం పాక్‌లో అలవాటుగా మారిందన్నారు. పోలీసులు కూడా ముక్తసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 75 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో ఉంటున్నారు.