జాతీయ వార్తలు

బంగ్లా విమోచనంపై డాక్యుమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బంగ్లాదేశ్ విముక్తికోసం 1971లో జరిగిన యుద్ధం పై భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించనున్నాయి. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ఈ విష యం తెలిపింది. 2020లో రానున్న బం గ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ వందవ జయంతిని పురస్కరించుకొని ఆ దేశం ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి భారత్ సహకరించనుంది. భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బంగ్లాదేశ్ సమాచార మంత్రి హసనుల్ హక్‌ను మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఇండియా రేడియో ఆగస్టు 23న బంగ్లాదేశ్, బెంగాలీ సంతతి ప్రజల కోసం ‘ఆకాశవాణి మైత్రీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఈ భేటీ సందర్భంగా భారత్.. బంగ్లాదేశ్‌కు చెప్పింది. ఇరు దేశాల మధ్య మైత్రీబంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక చానల్‌ను భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధం పై నిర్మించే డాక్యుమెంటరీ చిత్రానికి అవసరమైన ఆనాటి సన్నివేషాలతో కూడిన ప్రాచీన సామగ్రి తమ ఫిల్మ్స్ డివిజన్, దూరదర్శన్, భారత ప్రభుత్వానికి చెందిన ఇతర మీడియా విభాగాల వద్ద అందుబాటులో ఉందని వెంకయ్య నాయుడు ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ మంత్రికి తెలిపారు. 2021లో జరిగే బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్యమెంటరీ చిత్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. భారత్, బంగ్లాదేశ్‌లు ఉభయ దేశాలకు శత్రువయిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమాచార వ్యాప్తి ఎంతో కీలకమని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అన్నారు. సరయిన సమాచారాన్ని సకాలంలో వ్యాప్తి చేయడం ద్వారా వదంతుల వ్యాప్తిని నిరోధించవచ్చునని, అదే సమయంలో ఇరు దేశాల ప్రజల మధ్య సహకార స్ఫూర్తిని, అవగాహననను పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఒక జాయింట్ ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ అగ్రీమెంట్ కోసం ప్రతిపాదనపై దృష్టి సారించాలని భారత్, బంగ్లాదేశ్‌లు ఈ చర్చల సందర్భంగా అంగీకారానికి వచ్చాయి. భారత చలన చిత్రోత్సవాలను బంగ్లాదేశ్‌లో, బంగ్లాదేశ్ చలన చిత్రోత్సవాలను భారత్‌లో నిర్వహించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

చిత్రం.. బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖామంత్రి హసానుల్‌హక్ బుధవారం ఢిల్లీలో భారత సమాచారమంత్రి వెంకయ్యనాయుడ్ని కలుసుకున్న దృశ్యం