జాతీయ వార్తలు

మూడవ ఆర్థిక శక్తిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజీ, మార్చి 24: ప్రపంచంలోనే భారత్ మూడవ ఆర్థిక శక్తిగా త్వరలోఅనే అవతరిస్తుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. సముద్రంలోని ఖనిజాలు, ఇంధనాన్ని అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. సీఎస్‌ఐఆర్ జాతీయ సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ నిర్వహించిన సదస్సును ఆయన ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సముద్రంలోని పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకోవాలన్నారు. దీనివల్ల జలచరాలను కాపాడుకోగలుగుతామన్నారు. వీటిని ధ్వంసం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ఈ కారణాల వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, భూతాపం పెరుగుతుందన్నారు. ఖనిజాలు, ఇంధనం తదితరమైన వాటిని సముద్రం నుంచి ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యున్నత స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రకృతి సంపదను పర్యావరణానికి హాని లేకుండా వాడుకోవాలన్నారు. సముద్ర ఉత్పత్తుల ద్వారా నీలి విప్లవం సాధించాలన్నారు. భూతాపం మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సాగరమాల ప్రాజెక్టు, కోస్టల్ ఎకనామిక్ జోన్లు నిర్మించాలన్నారు. నీలి విప్లవం సాధిస్తే ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. భారత్ తన జాతీయ చమురు, సహజవాయువు డిమాండ్‌ను దిగుమతుల ద్వారా తీర్చుకుంటోందన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి పెట్టాలన్నారు. పవన విద్యుత్, కెరటాల విద్యుత్ వల్ల పర్యావరణానికి హానిలేని విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు.
చిత్రం.. దివంగత గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు గోవాలోని ఆయన నివాసంలో
నివాళులు అర్పిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు