జాతీయ వార్తలు

పారా మిలిటరీ బలగాల్లో పోరాట పటిమ పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: కేంద్ర పారామిలిటరీ బలగాల్లో వైద్యకారణాల వల్ల చురుకుగా పనిచేయని జవాన్లను పంపించి వేసేందుకు కొత్త అంచనా విధానాన్ని ప్రవేశపెట్టాలని పారామిలిటరీ బలగాల సంస్థలు కేంద్రాన్ని కోరాయి. కేంద్రహోంశాఖ కేంద్ర పారామిలిటరీ బలగాల సంస్థల అధిపతులతో నిర్వహించిన సమావేశాల్లో ఈ సంస్థలు పలు ప్రతిపాదనలు చేశాయి. బలగాల పటిష్టతను మెరుగుపరచాలని వారు కోరారు. సాలీనా 55వేల మంది జవాన్లను మెడికల్ కారణాలపై పంపించి వేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమ బల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ బలగాలు ఉన్నాయి. జవాన్లు, అధికారుల వయోపరిమితిని 57 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సిఫార్సు చేసింది. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీలో వేరువేరుగా వయోపరిమతిని అమలు చేస్తున్నారు. వేరువేరు వయోపరిమితులు ఉండడం రాజ్యాంగవిరుద్ధమని కోర్టు పేర్కొంది. సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారులు కేంద్రానికి యువ జవాన్లు ఎక్కువగా దళంలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పుల్వామా దాడి ఘటన తర్వాత మొత్తం బలగాల తీరును విశే్లషించామని చెప్పారు. వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచితే వైద్యకారణాలపై చురుకుగా పనిచేయలేని జవాన్లు, అధికారులు ఉంటారని తెలిపారు. మొత్తం అన్ని కేంద్ర పారామిలిటరీ బలగాల్లో దాదాపు 55వేల మంది వరకు వైద్యకారణాలపై చురుకుగా లేని జవాన్లు పనిచేస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 22,120 మంది, బీఎస్‌ఎఫ్‌లో 14,115 మంది, అస్సాం రైఫిల్స్‌లో 10,202 మంది, ఐటీబీపీలో 5,619 మంది, సీఐఎస్‌ఎఫ్‌లో 2,180 మంది, ఉన్నారు. ఒక వేళ 60 ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచితే మాత్రం మొత్తం వ్యవస్థను ప్రక్ష్రాళన చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు చెప్పారు. పారామిలిటరీ బలగాల్లో 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న జవాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో మొత్తం కేంద్రపారామిలిటరీ బలగాల వ్యవస్థను కూలంగాకషంగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బలగాల నిపుణులు కేంద్రాన్ని కోరారు.