జాతీయ వార్తలు

మరో ఇందిర... ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మార్చి 24: ప్రియాంకా గాంధీ వాద్రా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితమయి పనిచేస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రభావం చాలా వేగంగా పెరుగుతుందని ఆ పార్టీ నాయకుడు శశి థరూర్ ఇక్కడ చెప్పారు. 47 ఏళ్ల ప్రియాంక ఈ సంవత్సరం జనవరి 23న తూర్పు ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాలు చూసే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశం లాంఛనంగా పూర్తయింది. ప్రియాంక నియామకం వల్ల రాజకీయాల్లో కీలకమయిన ఉత్తరప్రదేశ్‌లో తమ అవకాశాలు బాగా పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నించగా, ‘ఆమె (ప్రియాంక) ప్రజల మనసులను బాగా ఆకట్టుకోగల మహిళ. ఆమె బాగా మాట్లాడుతారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు. హిందీ భాషలో జాతీయాలను ఉపయోగిస్తూ సహజసిద్ధంగా అనర్గళంగా మాట్లాడుతారు. ఆమె ప్రజలలోకి చొచ్చుకెళ్లగలుగుతారు. అనేక మంది ప్రజలకు తన నానమ్మను గుర్తుకు తెస్తారు’ అని శశి థరూర్ బదులిచ్చారు. ప్రియాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లో సగ భాగం పార్టీ వ్యవహారాలు చూసే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని, ఆమె తక్షణ కార్యరంగం తూర్పు ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ, దీర్ఘకాలంలో పార్టీలో ఆమె ప్రభావం చాలా వేగంగా పెరుగుతుందని తాను భావిస్తున్నానని శశి థరూర్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రియాంకకు ఉన్న ప్రజాదరణ ఇప్పటికే నిరూపితమయిందని ఆయన అన్నారు.