జాతీయ వార్తలు

వచ్చే నెలలో భారత్- ఆస్ట్రేలియా నౌకా విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న చైనాను కట్టడిచేసే లక్ష్యంతో భారత్-ఆస్ట్రేలియాలు మరింతగా చేరువవుతున్నాయి. జలాంతర్గాముల నిరోధక యుద్ధ తంత్రాన్ని ఎదుర్కొనే ధ్యేయంతో ఈ రెండు దేశాలు వచ్చే నెలలో అత్యంత భారీగా సైనిక విన్యాసాలు చేపట్టబోతున్నాయి. అత్యంత వ్యూహాత్మకమైన హిందూ మహాసముద్రంలో ద్వైపాక్షికంగా నౌకాదళ సహకారాన్ని పెంపొందించుకోవడమే విన్యాసాల ఉద్దేశమని చెబుతున్నారు. ఏప్రిల్ 2నుంచి 16వరకు విశాఖ తీరంలో ‘ఆసి ఇండెక్స్’ పేరుతో ఈ విన్యాసాలు జరుగనున్నాయి. అత్యధిక స్థాయిలో ఆస్ట్రేలియా రక్షణ దళాలు భారత్ చేరుకుంటాయని దౌత్యవర్గాలు వెల్లడించాయి. ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన ఓ సబ్‌మెరైన్ కూడా పాల్గొంటుందని, ఆస్ట్రేలియా నౌకాదళాలు పాల్గొంటాయని వెల్లడించాయి.