జాతీయ వార్తలు

గెలిపిస్తే మద్యం ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపూర్, మార్చి 25: ఎన్నికల్లో నెగ్గాలంటే ఓటర్లను ఆకర్షించేందుకు అవసరమైతే ఎలాంటి హామీలనైనా ఇవ్వాల్సిందే. ఈ హామీల్లో వింతగొలిపేవి, విడ్డూరంగా ఉండేవి కూడా ఎన్నో ఉంటాయి. తిరుపూర్ లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన మద్యాన్ని ఉచితంగానే అందిస్తానని హామీ ఇచ్చేశాడు. వృత్తిరీత్యా టైలర్‌గా ఉన్న షేక్ దావూద్ ఇందుకు సంబంధించి ఏకంగా ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశాడు. పాండిచ్చేరి నుంచి దిగుమతి చేసుకున్న 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీని ఔషధంగా కూడా వాడుకోవచ్చునని, దీనివల్ల ప్రతి కుటుంబానికి కూడా ఎంతో మేలుజరుగుతుందని ఆయన తెలిపాడు. ఎంత గెలవాలన్న పట్టుదల ఉన్నా మరీ ఇలాంటి హామీ ఇస్తారా అని అడిగినపుడు ‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తాగుతారు. సమస్యల్లా కల్తీ మద్యంతోనే. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అందుకే నన్ను గెలిపిస్తే స్వచ్ఛమైన మద్యాన్ని ఇస్తానని చెబుతున్నాను’ అని వివరించాడు. 50 సంవత్సరాల వయసుగల ఈ అభ్యర్థి హామీలు కేవలం ఉచిత మద్యంతోనే ఆగిపోలేదు. ప్రతినెలా ప్రతి కుటుంబానికి 25వేల రూపాయలు కూడా ఇస్తానని, మెట్టూరు నుంచి తిరుపూర్ వరకు కాలువ తవ్వి మంచినీటిని కూడా సరఫరా చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. అలాగే పెళ్లి సాయం కింద 10 సవర్ల బంగారాన్ని, కొత్తగా పెళ్లయినవారికి 10 లక్షల రూపాయలను కూడా ఇస్తానని చెప్పాడు. అంతేకాదు..తమిళనాడులో మద్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేయవద్దని కూడా చెబుతున్న షేక్ దావూద్ ఏకంగా తన మేనిఫెస్టోలో 15 హామీలను గుప్పించాడు.