జాతీయ వార్తలు

పచ్చని కుటుంబాల్లో ఎన్నికల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మార్చి 25: అధికారం ముందు బంధుత్వాలు.. స్నేహాలు.. రక్తసంబంధాలు అన్నీ బలాదూరే.. అప్పటివరకు కలసిమెలసి ఉన్న వారి మధ్య విభేదాలు, గొడవలు, కొట్లాటలు సృష్టిస్తున్నాయి ఈ ఎన్నికలు.. పచ్చని కుటుంబాల చిచ్చును రగిలిస్తున్నాయి.. తమకు వచ్చే పదవులు, అధికారం ముందు ఈ ప్రేమాప్యాయతలు ఎంతలే అనుకుంటున్నారో ఏమో తండ్రీ, కొడుకు అని లేదు.. అక్కా చెల్లి బంధం లెక్కలేదు.. అన్నా, తమ్ముడు అనుబంధం లేదు.. ఇలా అన్ని బంధాలను కాదని ఎన్నికల బరిలో దూకి శత్రువుల్లా కొట్లాడుకుంటున్న దృశ్యాలు మనకు ఒడిశా ఎన్నికల్లో సాక్షాత్కరిస్తున్నాయి. టికెట్ల కోసం, పార్టీల కోసం సాక్షాత్తూ కుటుంబ సభ్యులే కత్తులు దూసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు పార్టీల టికెట్లు లభించడంతో వారు ప్రత్యర్థులుగా మారి ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు.
ఒడిశాలో పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని బోలాన్‌గిరి లోక్‌సభకు బిజూ జనతా దళ్ (బీజేడీ) నుంచి సిట్టింగ్ ఎంపీ కాలికేష్ నారాయణ సింగ్ దేవ్ పోటీలో ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా ఆయన వదినగారైన మాజీ ఎంపీ సంగీత సింగ్ దేవ్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. అలాగే సుందర్‌ఘర్ జిల్లాకు వస్తే కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి అయిన హేమానంద్ బిశ్వాల్ ఇద్దరు కుమార్తెలు వేర్వేరు పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఒక కుమార్తె సునీతా బిశ్వాల్ సుందర్‌ఘర్ లోక్‌సభ నుంచి బీజేడీ అభ్యర్థిగా, చిన్నకుమార్తె అమిత అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పటిష్టమైన కేడర్ ఉందని, అందువల్ల ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తన సోదరి ప్రభావం తన గెలుపుపై ఏమాత్రం ఉండదని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే దక్షిణ ఒడిశా ప్రాంతంలో కుటుంబ బంధాలు సైతం మనకు ఎన్నికల్లో గోచరిస్తున్నాయి.
బీజేడీ ఎంపీ జినా హిక్కాక తన భార్య కౌసల్య కోసం టికెట్‌ను త్యాగం చేశారు. ఆమె కోరాపుట్ (ఎస్టీ) స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాజా కృష్ణ చంద్ర గజపతి మునిమనవరాలైన కల్యాణదేవి బీజేడీ టికెట్‌పై పర్లాకేముండి అసెంబ్లీనుంచి పోటీలో ఉన్నారు. ఈమె రెండుసార్లు బెరంపూర్ నుంచి ఎంపీగా చేసిన గోపినాథ్ గజపతి కుమార్తె. ఒడిశా అసెంబ్లీ కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన నరసింగ మిశ్రా బోలన్‌గిర్ శాసనసభ స్థానానికి పోటీ చేస్తుండగా, ఆయన కుమారుడు సమరేంద్ర మిశ్రా అదే పార్లమెంట్‌కు అదే పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్ దాస్ కలఖండి లోక్‌సభకు ఆయన కుమారుడు భవానీపట్న నుంచి అసెంబ్లీకి రంగంలో దిగారు. అదేవిధంగా ఇదే పార్టీ నుంచి జార్జి టిక్రే సుందర్‌ఘర్ లోక్‌సభ నుంచి, ఆయన కుమారుడు రోహిత్ జోసఫ్ బిమిత్రాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ కుమారుడైన శిశిర్ గోమాంగ్ బీజేపీ తరఫున గునుపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న బిజూ జనతా దళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ ఐదోసారి కూడా ఎన్నికల్లో విజయం బావుటా ఎగురవేసి ముఖ్యమంత్రి పీఠం మీద కొనసాగాలన్న ధ్యేయంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. 2000 నుంచి రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ పాలనే కొనసాగుతోంది. ఈసారి కూడా ప్రజలు తమ పార్టీకే పట్టం గడతారన్న ధీమాను బీజేడీ వ్యక్తం చేస్తోంది.