జాతీయ వార్తలు

డీజీపీని మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నాయకులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం విజయ సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న ఠాకుర్, ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంకటేశ్వరరావుతోపాటు మరి కొంతమంది ఉన్నతాధికారులు చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. డీజీపీని తొలగించి కొత్తవారిని నియామించాలని కోరినట్టు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన సాక్ష్యాధాలను ఈసీకి అందించినట్టు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్‌ను ఉపసంహరించాలని ఈసీని మరోసారి కోరినట్టు చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమంగా నగదు పంపిణీ చేస్తున్నారని, దీనికి ప్రభుత్వాధికారులు కూడా సహకారం అందిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరినట్టు విజయ సాయిరెడ్డి చెప్పారు.
6 వేల కోట్లు సిద్ధం చేసిన టీడీపీ : బీజేపీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున డబ్బులను పంచేందుకు ఏర్పాట్లు చేసుకుందని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సోమవారం బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలోని ఆ పార్టీ నాయకుల బృందం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులను కలిసింది. అనంతరం జీవీఎల్ విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకుగాను ప్రజలకు డబ్బులను పంచడానికి తెలుగుదేశం పార్టీ రూ.6 వేల కోట్లను సిద్ధం చేసిందని ఆరోపించారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఏపీ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకుగాను ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి పంపించాలని కోరినట్టు చెప్పారు. ఏపీని సున్నితమైన రాష్ట్రంగా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని కోరినట్టు జీవీఎల్ చెప్పారు.

చిత్రాలు.. ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత వేర్వేరుగా జరిగిన మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి, *బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు