జాతీయ వార్తలు

15వేల మందితో ధర్మసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోస్నా/ రోరి/ మీరట్, జనవరి 20: ఇస్లామిక్ సైద్ధాంతిక పునాదులతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ఐసిస్‌ను ఢీకొనేందుకు ధర్మసేన పేరిట ఓ సాయుధ బలగం సన్నద్ధమవుతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ సరిహద్దు వరకూ హిందూ స్వాభిమాన్ పేరుతో ధర్మసేన శిక్షణా శిబిరాలు ఆవిర్భవించాయి. 2020 నాటికల్లా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ఐసిస్ ఆక్రమించుకునే అవకాశం ఉందని..దాన్ని బలంగా ఢీకొనేందుకు ఇప్పటికే 15వేల మంది ధర్మసేన సైనికుల్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. హిందూమతాన్ని పరిరక్షించడం కోసం ప్రాణాలకైనా తెగించేందుకు తమ సైనికులు సిద్ధమేనని నిర్వాహకులు అంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన బృందం జరిపిన పరిశోధనలో ధర్మసేన కార్యకలాపాలు, దాని లక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మత పరంగా అత్యంత సునిశిత ప్రాంతమైన పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో విస్తరించిన నాలుగు ధర్మసేన శిబిరాలను ఈ బృందం పరిశీలించింది. ఎనిమిది సంవత్సరాలు కూడా నిండని బాల బాలికలూ కత్తులు, ఆయుధాల ఉపయోగించడంలో శిక్షణ పొందడం ఇక్కడ కనిపించింది. ఘజియాబాద్ జిల్లాలోని దాస్నాలోని ఓ ఆలయానే్న ప్రధాన కార్యాలయంగా చేసుకుని పని చేస్తున్న ధర్మసేన నేతలు తమ ‘సైనికుల’సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని గట్టిగానే చెబుతున్నారు. మొత్తం 50కి పైగా ఉన్న శిక్షణా శిబిరాల్లో కొన్నింటిని రహస్యంగా మరికొన్నింటిని బాహాటంగానే నిర్వహిస్తున్నారు. బామ్‌హెటా, రోరీ వంటి ప్రాంతాల్లో పని చేస్తున్న ఈ కేంద్రాల్లో ‘శత్రువుల దాడిని తిప్పి కొట్టే..రీతిలో స్ర్తిపురుషులు, బాల బాలికలకు శిక్షణ ఇవ్వడంతో పాటు హిందూ ధర్మాన్నీ బోధిస్తున్నారు. మీరట్ నగరంలో మూడు, ముజఫర్‌నగర్‌లో ఐదు శిక్షణా కేంద్రాలు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. ఎనిమిది సంవత్సరాల నుంచి 30సంవత్సరాల లోపువారిని శిక్షణా శిబిరాల్లో చేర్చుకుంటున్నామని..పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో విస్తరించిన తమ కేంద్రాల్లో వీరిని సుశితుల్ని చేస్తున్నామని హిందూ స్వాభిమాన్ నాయకుడు, విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ దుర్గావాహిని సభ్యుడు చేతనా శర్మ తెలిపారు. హిందూ మత పరిరక్షణ..ఇస్లామిక్ ఉగ్రవాదంపై పిల్లలకు సరైన అవగాహన కలిగించిన తర్వాతే వారికి సాయుధ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా భగవద్గీత శ్లోకాలను ఆకళింపు చేసుకునేలా వీరిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్న ఆయన ‘పునర్జన్మపై నమ్మకం ఉన్న హిందువులు మృత్యువుకు భయపడాల్సిన అవసరం లేదు’అని ఉద్ఘాటించారు. శిబిరాల్లో శిక్షణ పొందుతున్న పిల్లల మాటల్లో ఇదే రకమైన ధోరణి కనిపిస్తోంది. ‘అమ్మలు, అక్కలకు భద్రత కొరవడింది. వారిని రక్షించడానికి..నన్నునేను కాపాడుకోవడానికే ఈ శిక్షణ పొందుతున్నాను’అని సీమా కుమారి అనే ఓ ఎనిమిదేళ్ల బాలిక చెప్పడమే ఇందుకు తార్కాణం. ‘ప్రభుత్వం విఫలం అయింది కాబట్టే ఆయుధాలు చేపట్టక తప్పడం లేదు’అని మరో తొమ్మిదేళ్ల బాలుడి మాటలూ శిక్షణ తీరుకు అద్దం పడుతున్నాయి.
యువకుల్లో హిందూ భావజాలాన్ని పాదుగొల్పడానికి ఉగ్రవాద దాడుల్నే ప్రధాన అంశాలుగా హిందూ స్వాభిమాన్ సంస్ధ సిద్ధాంత కర్తలకు ఎంచుకుంటున్నారు. తాము ఇచ్చే శిక్షణ చాలా స్వల్పమైనదని, దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల గురించే యువతకు తెలియజేస్తున్నామని పరమీందర్ ఆర్య అనే ఓ మాజీ సైనికుడు వెల్లడించాడు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చీరలు, శాలువలు ఇవ్వడానికేనా నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకున్నదీ అంటూ ప్రశ్నించాడు. పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి గురించే పిల్లలతో ప్రధానంగా చర్చించడం ద్వారా ఇస్లామిక్ మనవ్ఢ్యౌం వల్ల హిందూ మతానికి వాటిల్లుతున్న ముప్పు పై వారికి అవగాహన కలిగిస్తున్నామన్నారు. ‘ఏది ఏమైనా శిక్షణా శిబిరాలను ఆపేది లేదు’అని ఘజియాబాద్‌లో ఓ శిబిరాన్ని నిర్వహిస్తున్న మాజీ మల్లయోధుడు అనిల్ యాదవ్ తెలిపాడు. ఈ శిబిరాలన్నింటినీ అంకారాల పేరుతోనే నిర్వహిస్తున్నామని, ఇదేమీ చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. హిందూ ధర్మసేన ఆవిర్భావానికి స్వామీ నర్సింగానంద్ స్వరస్వతి అనే ఓ సాధువు సిద్ధాంతమే ఆలంబన.ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బండ్‌లో ఉన్న దారుల్ ఉలూం ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ఐసిస్‌కు సైద్ధాంతిక పునాధి అని చెబుతున్న స్వామీజీ ‘ఇస్లామిక్ రాజ్యానికి (ఇస్లామిక్ స్టేట్) హిందూ రాజ్యమే (హిందూ స్టేట్) సమాధానమని ఉద్ఘాటించారు. ఇప్పటికే హిందూ స్టేట్-ఇస్లామిక్ స్టేట్ మధ్య యుద్ధం మొదలైందని తెలిపారు. ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థ హిందువులకూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా..హిందూ సేన సాయుధ శిక్షణా శిబిరాలు డజన్ల కొద్దీ కొనసాగుతున్నా..వాటి గురించి తనకేమీ తెలియదని చెబుతున్న మీరట్ జోన్ ఐజి అలోక్ శర్మ ‘అన్ని వివరాలనూ పరిశీలిస్తాను’అని వెల్లడించారు.