జాతీయ వార్తలు

పేదల ఆక్రందన పట్టని యూపీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పనుల్లో వేగం, పారదర్శకతకే ప్రాధాన్యం * ప్రధాని మోదీ ఉద్ఘాటన
* షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు
షిరిడి, అక్టోబర్ 19:దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలనపై ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఓ ప్రత్యేక కుటుంబం పేరును ప్రచారంలోకి తేవడానికే ఆ ప్రభుత్వాలు పని చేశాయని ధ్వజమెత్తారు. శుక్రవారం షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం జరిగిన ఓ సభలో మాట్లాడిన మోదీ సమీకృత అభివృద్ధి సాధించేందుకు విచ్ఛిన్న శక్తుల్ని ఓడించాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలకు తన ప్రభుత్వానికి మధ్య పనితీరులో ఎంతో తేడా ఉందని వివరించిన మోదీ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం, వారికి ఆవాసం కల్పించడం కోసం వేగవంతంగా చర్యలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వ చివరి నాలుగేళ్ల కాలంలో యూపీఏ ప్రభుత్వం కేవలం పేదల కోసం 25లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించగలిగిందని, తమ ప్రభుత్వం అదే నాలుగేళ్ల పాలనలో కోటి 25లక్షల ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చిందని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఆవాసం కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.గతంలో కూడా పేదలకు ఇళ్ల కల్పన కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ చిత్తశుద్ధి లోపించిందని, ఓ కుటుంబాన్ని ప్రచారంలోకి తేవడానికే అవి పని చేశాయని మోదీ అన్నారు. పేదలకు ఆవాసం కల్పించడం ద్వారా వారికి సాధికారతను అందించేందుకు గట్టి కృషి జరుగలేదని, కేవలం ఓటు బ్యాంకును పెంపొందించుకోవడమే పనిగా పని చేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఓ ఇంటిని నిర్మించేందుకు 18నెలలు తీసుకుంటే తమ ప్రభుత్వం కేవలం 12 నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేస్తోందన్నారు. అదే యూపీఏ ప్రభుత్వానికి కోటి 25లక్షల ఇళ్లను నిర్మించేందుకు 20ఏళ్లు పట్టేదని, తమ అవకాశం కోసం ప్రజలు మరో 20 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చేదని అన్నారు. ఇళ్ల పరిమాణాన్ని పెంచడంతో పాటు ఆర్థిక సహాయ మొత్తాన్ని కూడా తాము 70వేల నుంచి లక్షా 25వేల రూపాయలకు పెంచామని చెప్పారు. లబ్ధిదారుల్ని ఎంపిక చేయడంలో పారదర్శక విధానాన్ని అవలంబించామని, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేశామని చెప్పారు. అప్పుడు ఉన్న ప్రజలు, వనరులు ఇప్పుడు ఉన్నవి ఒకటేనని కానీ తమ ప్రయత్నంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండటం వల్ల పనుల్ని వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయగలుగుతున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే లక్ష మంది ప్రయోజనం పొందారని మోదీ గుర్తు చేశారు. సగటున ప్రతి లబ్ధిదారుడికి 20వేల రూపాయల చొప్పున అందించామన్నారు.తీవ్రమైన జబ్బులకు లోనయ్యే వారికి చికిత్సకోసం ఏటా 5లక్షల మొత్తాన్ని సమకూర్చడం జరుగుతోందని చెప్పారు. దీని వల్ల 50 కోట్ల మంది పేదలు వైద్య పరంగా ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు.
టైర్-2, టైర్-3 పట్టణాల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామని, దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా పెరుగుతాయని మోదీ తెలిపారు.