రాష్ట్రీయం

సంప్రదాయాల్లో జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 20: ఆలయాలు సుదీర్ఘ కాలం నుంచి పాటిస్తున్న సంప్రదాయాల్లో ఎవరి జోక్యమూ తగదని ప్రముఖ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అనంతరం రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రజనీకాంత్ తొలిసారి స్పందించారు. ప్రతి రంగంలో మహిళలకు సమానత్వం ఉండాలనే విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. ‘అయితే, దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు, ప్రతి ఆలయానికి సుదీర్ఘకాలం నుంచి అనుసరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఎవరూ కూడా వాటిలో జోక్యం చేసుకోకూడదనేది నా అభిప్రాయం’ అని రజనీ చెబుతూనే, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునూ గౌరవించాలని 67 ఏళ్ల రజనీకాంత్ అన్నారు. మతాచారాల విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని, దానిని అమలు చేస్తామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత రాష్ట్రంలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయిదు రోజుల నెలవారీ పూజలకోసం ఈ నెల 17న శబరిమల ఆలయాన్ని తెరవడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇదిలా ఉండగా ‘మీటూ’ ఉద్యమం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అయితే ఈ ఉద్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రజనీకాంత్ అన్నారు.