జాతీయ వార్తలు

గుండెలు పిండే విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, అక్టోబర్ 20: దసరా పండుగ ఉత్సాహం ఆవిరైపోయింది. ఎవర్ని కదిపినా గుండెలను పిండేసే గాథలే. అమృత్‌సర్-మానావాల స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదం 61 మందిని పొట్టనబెట్టుకుంది. మరోవైపు కుటుంబ సభ్యుల సమాచా రం కోసం బంధువుల బాధలు వర్ణనాతీతం. విజయ్‌కుమార్‌కు అశీష్, మనీష్ అనే ఇద్దరు కుమారులు, అశీష్ జోడాపాఠక్‌కు వెళ్లి క్షేమంగానే తిరిగి వచ్చాడు. మనీష్ ఆచూకీ కోసం విజయ్‌కుమార్ తల్లడిల్లిపోతున్నారు. మనీష్ ఫోన్‌కు కాల్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం నాటి కాళరాత్రిని తలచుకుని కుమార్డుకి కోసం తీవ్రంగా రోదిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం రైల్వే ట్రాక్‌కు చేరుకున్న కుమార్‌కు తెగిపడిన కాలు, ఓ చేయి కనిపించింది. అయితే అవి మనీష్‌వికాదు..‘నా కుమారుడు నీలం రంగు జీన్స్ ధరించాడు. ప్రమాద స్థలంలో అలాంటి ఆధారాలేవీ కనిపించలేదు’అని గురునానక్ ఆసుపత్రి వెలుపల మీడియాతో వాపోయారు. తన ప్రపంచానే్న కోల్పోయాన్న బాధను ఆయన వ్యక్తం చేశారు. గురునానక్ మెడికల్ కాలేజీ బాధితుల రోదనలతో నిండిపోయింది. సప్నా అనే మహిళ భర్త సతేందర్ రావణ దహనం దృశ్యాలను వాట్సప్‌కాల్ ద్వారా లైవ్‌లో భార్యకు చూపుతుండగానే ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రగాయాలై అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రావణ దహనం చూస్తూ జనం కేరింతలు కొడుతూ పట్టాలపైకి వెళ్లారని, అక్కడ రైలు రావడం చూసి మరో ట్రాక్‌పైకి వెళ్లి ఘోర ప్రమాదానికి గురయ్యారని సప్నా వెల్లడించారు. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకేసారి రావడంతో జనంలో పెద్ద తొక్కిసలాటే జరిగిందని పేర్కొన్నారు. ఎవరికి వారు మొబైల్ ఫోన్లలో రావణ దహనం దృశ్యాలు రికార్డు చేసుకుంటుండగా ఈ ఉపద్రవం సంభవించిందన్నారు. సప్నా సొంత కజిన్, ఏడాది వయసుగల మేనల్లుడిని కోల్పోయింది. అయితే బండి దూసుకుపోవడం వల్ల వారు చనిపోలేదని, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చిన్నారికి రాళ్లు గుచ్చుకుని, సోదరి జనం తొక్కిసలాటతో చనిపోయార ని సప్నా పేర్కొన్నారు. యూపీకి చెందిన జగునానందన్ ట్రాక్‌పై లేకపోయినా జనంతో సుకురావడంతో రైలుకిం ద పడి గాయాల పాలయ్యా డు. తల్లి పరమ్‌జీత్ కౌర్‌తో కలిసి జోడాపాఠక్ వెళ్లిన ఖుషి అనే బాలిక ప్రమాదం షాక్‌తో కోమాలోకి వెళ్లిపోయింది. బాణా సంచా పేలుళ్ల శబ్దం లో రైలు రావడాన్ని గమనించలేదని కౌర్ వెల్లడించారు. గాయాలతో బయటపడ్డ గోపాల్‌గంజ్‌కు చెందిన మోతీలాల్(35) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాక్‌కు పక్కన నిలబడి ఉన్న అంతే మోతీలాల్‌ను తోసేయడంతో కింద పడిపోయాడు. అలాగే తలపై బలమైన గాయాలైన సందీప్ (23) ప్రభు త్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నలుగురు కుటుంబ సభ్యులతో కలి సి రావణ దహనం చూడ్డానికి వెళ్లిన జితేంద్ర ఈ ఘోర ప్రమాదంలో ముగ్గుర్ని కోల్పోయాడు. భార్య, అతను ప్రమాదం నుంచి బయటపడగా, ఆరేళ్ల కుమార్తె, మూడే ళ్ల కుమారుడు, మామను కోల్పోయాడు. తల, కాళ్లు తెగిపోయి మృతి చెందిన వారే ఎక్కువ మందని గురునానక్ ఆసుపత్రి సర్జరీ యూనిట్ ప్రొ. రాకేశ్ శర్మ తెలిపారు. మృతులు, గాయపడ్డవారూ యూపీ, బిహార్ వారే ఎక్కువ మందని ఆయన అన్నారు.