జాతీయ వార్తలు

ద్వైపాక్షిక బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. శ్రీలంకలో భారత్ ఆర్థిక సాయంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన విక్రమసింఘే చివరి రోజు ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో మోదీతో చర్చలు జరిపారు. ‘శ్రీలంకకు మా హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంది’ అంటూ మోదీ శ్రీలంక ప్రధానికి స్వాగతం పలికారు. ‘ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఈ ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలలోని అనేక అంశాలను సమీక్షించారు. భారత్ ఆర్థిక సాయంతో శ్రీలంకలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యేకించి సమీక్షించారు’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల ప్రధానులు హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరుపుతున్న దృశ్యాలను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. విక్రమసింఘే భారత పర్యటనలో.. జాఫ్నాలో భారత్ ఆర్థిక సాయంతో చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టుల పురోగతిని ఇరు దేశాల ప్రధానులు సమీక్షించారు. తమిళుల అంశంపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ, తమిళుల ప్రాబల్యం గల ప్రాంతాలలో అధికారాల సంక్రమణ గురించి మోదీ, విక్రమసింఘే చర్చించారు.
భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తనను హతమార్చడానికి కుట్ర పన్నిందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆరోపించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన కొద్ది రోజులకే విక్రమసింఘే భారత పర్యటనకు వచ్చారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఈ వార్తలను గట్టిగా కొట్టిపారేసింది.
ఇదిలా ఉండగా, శనివారం అంతకు ముందు భారత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా విడివిడిగా విక్రమసింఘేతో భేటీ అయ్యారు. భద్రతాపరమయిన అంశాలతో పాటు భారత్, శ్రీలంక మధ్య ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో సహకారం గురించి రాజ్‌నాథ్ సింగ్, విక్రమసింఘే చర్చించారు. విక్రమసింఘేతో చర్చల సందర్భంగా సుష్మా స్వరాజ్ కూడా శ్రీలంకలో భారత్ ఆర్థిక సాయంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.