క్రీడాభూమి

వరల్డ్ కప్‌లో ధోనీ ఉంటేనే కోహ్లీకి మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో బ్యాట్స్‌మన్-వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉంటేనే విరాట్ కోహ్లీకి మేలు జరుగుతుందని దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎంతో అనువజ్ఞుడైన ధోనీ సలహాలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ధోనీ కెప్టెన్సీలో 2007 టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్, 2011లో వరల్డ్ కప్‌లను టీమిండియా గెల్చుకున్న సంగతి తెలిసిందే. మైదానంలో ఫీల్డింగ్ సమయంలో తలెత్తే స్వల్ప మార్పులతోపాటు బౌలింగ్ సమయంలో హిందీలో మాట్లాడుతూ బౌలింగ్‌లో మెలకువలు చెప్పగల సత్తా ఉన్నవాడు ధోనీ అని అంటూ అతని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇదిలావుండగా, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో త్వరలో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లకు ధోనీని ఎంపిక చేయని విషయం తెలిసిందే. ధోనీ స్థానంలో యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను సెలక్టర్ల కమిటీ కొద్దిరోజుల కిందట ఎంపిక చేసింది. కేవలం ఈ ఆరు టీ-20 మ్యాచ్‌లకే ధోనీని పక్కన పెట్టామని, అలాగని అతనిని టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచే ఉద్వాసన పలికినట్టు కాదని సెలక్టర్ల కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్న విషయం తెలిసిందే. 2006లో టీ-20 ఫార్మాట్ ప్రారంభమైన 2006 తర్వాత ఇప్పటివరకు జరిగిన 104 మ్యాచ్‌లలో ధోనీ 93 మ్యాచ్‌లు ఆడాడు. టీ-20లలో ధోనీ 1,487 పరుగులు చేశాడు. ఇదిలావుండగా, విండీస్, ఆసిస్‌తో జరిగే టీ-20 సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి 16 మంది సభ్యుల బృందానికి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.