జాతీయ వార్తలు

జనగామ స్థానం నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: జనగామ తప్ప మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే ప్రసక్తే లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. లక్ష్మయ్య మంగళవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవటం దురదృష్టకరమన్నారు. ఇందుకు దారితీసిన పరిస్థితుల గురించి వాకబు చేసేందుకు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీకి వచ్చారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి తన ఒక్క పేరునే ప్రతిపాదించినా తన పేరు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి తన పేరునే సిఫారసు చేసింది.. ఈ విషయాన్ని భక్తచరణ్‌దాస్ స్వయంగా విలేఖరులతో చెప్పారని ఆయన అన్నారు. మిత్రపక్షాలకు జనగామ శాసనసభ సీటు కేటాయిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. జనగామ శాసనసభ నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు ఇస్తున్నట్లు ఎవరైనా అధికారికంగా ప్రకటించారా? అని ఆయన ప్రశ్నించారు. తాను గత 35 సంవత్సరాల నుండి జనగామకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని లక్ష్మయ్య చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడి పేరు కూడా మొదటి జాబితాలో ఎందుకు పెట్టలేదనేది అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖరరావు నియంతృత్వ పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేందుకే మహాకూటమి ఏర్పడిందని ఆయన వాదించారు. జనగామ టికెట్ లభించకపోతే ఏం చేస్తారని అడుగ్గా తనకు జనగామ టికెట్ ఇవ్వకపోవడమనేదే జరగదని అన్నారు. జనగామ టికెట్ తనకు లభించటం ఖాయం.. అయితే మొదటి జాబితాలో లేకపోవటం వలన కొంత నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు.