జాతీయ వార్తలు

వారసులకే టికెట్లు...ః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి....
============
జైపూర్, నవంబర్ 13: రాజస్థాన్‌లో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలకోసం బీజేపీ ఆదివారం రాత్రి 131 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాను పరిశీలిస్తే 85 మంది సిటింగ్‌లకు టికెట్లు ఇవ్వడంతోపాటు టికెట్ దక్కనివారి కుటుంబ సభ్యులు, వారసులకు పెద్దపీట వేసింది. వారసత్వ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ కూడా అదే దారితో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల ఎంపికలో ఎంత తర్జనభర్జనలు జరిగినప్పటికీ, అంతర్గతంగా అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు ఇలాంటి ఎంపిక తప్పలేదని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. అలాగే పార్టీలో పనిచేస్తూ మరణించిన వారి వారసులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవల మరణించిన ఎంపీ సన్వర్‌లాల్ జాట్, మాజీ మంత్రి దిగంబర్ సింగ్ కుమారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అలాగే బికనీర్ జిల్లా కోలయాత్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను పార్టీ సీనియర్ నేత దేవీసింగ్ భాటి కోడలు పూనమ్ కన్వర్‌కు, బయానా అసెంబ్లీ టికెట్ రిషి బన్సాల్ భార్య రీతుకు కేటాయించారు. ప్రతాప్‌గర్ స్థానం మాజీ మంత్రి నంద్‌లాల్ మీనా కుమారుడు హేమంత్ మీనాకు, మాజీ ఎమ్మెల్యే గుజ్రంత్ సింగ్ మనమడు గుర్‌వీర్ సింగ్ బ్రార్‌కు, జోథ్‌పూర్ స్థానం మాజీ ఎమ్మెల్యే కైలాష్ బన్సాలీ బంధువు అతుల్ బన్సాలీకు, బమన్వాస్ స్థానం మాజీ ఎమ్మెల్యే కుంజీలాల్ కుమారుడు రాజేంద్ర మీనాకు కట్టబెట్టారు.