జాతీయ వార్తలు

బీజేపీ బోణీ కొడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి....
============
ఐజ్వాల్: మిజోరం రాష్ట్రం చిన్నదే అయినా రాజకీయాలకు కొదవలేదు. ప్రతి రాజకీయ పార్టీ రోజుకో కొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు చెమట పుట్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 10 లక్షలే. మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. ఈ సారి ఒక్క సీటులోనైనా బోణీ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరుగుతోంది. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ క్రైస్తవ వ్యతిరేకి అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ మాత్రం అభివృద్ధి, సంక్షేమ అజెండాతో దూసుకుపోతోంది. మియాన్మార్, బంగ్లాదేశ్‌ల మధ్య మిజోరం రాష్ట్రం వ్యాపించి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండగను బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో జోష్ పెరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ మిజోరంలో 2008 నుంచి అధికారంలో ఉంది. వరుసగా మూడోసారి గెలిచేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 34 సీట్లు, ఎంఎన్‌ఎఫ్‌కు ఐదు సీట్లు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు ఒక సీటు వచ్చింది. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 32 సీట్లు వచ్చాయి. మేఘాలయ, నాగాలాండ్‌లో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. కాని ఇక్కడ బీజేపీ గెలిచి ఇతర పార్టీలతో కలిసి మిశ్రమప్రభుత్వ ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమిలో ఎంఎన్‌ఎఫ్ ఉన్నా, ఇక్కడ 39 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. ఇక్కడ బీజేపీతో ఎంఎన్‌ఎఫ్ లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మతతత్వ వైఖరిని ఎండగడుతూ మిజో భాషలో 50 వేల కరపత్రాలు పంపిణీ చేసింది. కాగా చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఎంఎన్‌ఎఫ్ ధ్వజమెత్తింది. ఈ కౌన్సిల్ పరిధి 1500 చ.కిమీ. ఇక్కడ గత ఏడాది 20 మందిసభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నిక జరిగింది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌కు ఎనిమిది, కాంగ్రెస్‌కు ఆరు, బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే జాతీయ స్థాయిలో బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటుచేశాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు మద్దతును విరమించుకుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సంస్థను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో సభ్యుడుగా ఉన్న అస్సాం బీజేపీ నేత హిమంత బిశ్వా శర్మ , ఎంఎన్‌ఎఫ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, కాంగ్రెస్ ఓటమికి చేతులు కలిపారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.