జాతీయ వార్తలు

శబరిమల తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు మరోసారి నిరాకరించింది.
ఇదే విషయమై దాఖలైన పలు వ్యాజ్యాలను పరిశీలించిన సుప్రీం కోర్టు మంగళవారం స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సెప్టెంబర్ 28న తాము ఇచ్చిన తీర్పుపై పునర్విచారణ జరపడానికి అంగీకరించింది. వచ్చే ఏడాది జనవరి 22న దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లను బహిరంగ విచారణ జరపుతామని ప్రకటించింది. కాగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేను ఇవ్వాలని కోరుతూ బుధవారం నేషనల్ అయ్యప్ప డివోటీస్ (ఉమెన్స్) అసోసియేషన్ తరఫున హాజరైన న్యాయవాది మాథ్యూస్ జె.నెడుంపుర చీఫ్ జస్టిస్ రంజన్ గోగయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తన వాదన వినిపిస్తూ గతంలో అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చునని సుప్రీం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం పిటిషనర్ జనవరి 22వరకు ఆగాలని, అప్పుడు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ప్రత్యేక బెంచ్ విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు. కాగా, సుప్రీం తీర్పును పునః సమీక్షించాలని దాఖలు చేసిన 48 పిటిషన్లను మంగళవారం గొగోయ్ నేతృత్వంలోని బెంచి విచారించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై దాఖలయ్యే తాజా పిటిషన్లను గతంలో వేసిన వ్యాజ్యాలను పరిశీలించిన తర్వాతే వీటి సంగతి చూస్తామని సుప్రీం స్పష్టం చేసింది.