రాష్ట్రీయం

తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ధరను చెప్పలేం.. పార్లమెంటుకే వెల్లడించ లేదు: అటార్నీ జనరల్
* ఈ విమానాల ధరల గురించి మేమూ చర్చించం: సుప్రీం
న్యూఢిల్లీ, నవంబర్ 14: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య బుధవారం విచారణ ముగిసింది. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కోర్టులో బుధవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్‌జెట్స్ కొనుగోళ్లకు సంబంధించి వచ్చిన అభియోగాలపై విచారణను పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌ఏ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, అవకతవకలపై విచారణ జరపాలని వివిధ సంస్థలు కోర్టును కోరాయి. మరోవైపు ఈ కేసులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేంద్రం తరఫున బలమైన వాదనలు వినిపించారు. ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలుకు సంబంధించి వివరాలు వెల్లడించలేమని ఆయన కోర్టుకు చెప్పారు. పార్లమెంటుకు కూడా కేంద్రం ఈ జెట్స్‌కు సంబంధించిన రేటు వివరాలను వెల్లడించలేదని ఆయన చెప్పారు. కేవలం నిపుణులు మాత్రమే ఈ వివరాలను మదింపు వేయగలరన్నారు. కోర్టు ఆదేశంపై కేంద్రం సీల్డ్ కవర్‌లో రాఫెల్ ఫైటర్ జెట్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఈ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేయవచ్చా లేదా అంశంపై విచారణ చేసే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన కోర్టుకు చెప్పారు. కేవలం యుద్ధరంగ నిపుణులకు మాత్రమే ఈ వివరాలు తెలుసన్నాలరు. రాఫెల్ జెట్స్ కొనుగోళ్లకు సంబంధించి రేటు వివరాలు గోప్యతకు సంబంధించినవరి, సీక్రెట్ క్లాజ్ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు. దీనివల్ల మన శత్రువులు అవకాశంగా తీసుకుంటారన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ధరల వివరాలు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ రేటు విషయంలో తాను కోర్టుకు సహకరించలేనని అన్నారు. ఈ రేటు విషయం లీకైతే, నా ఆఫీసు బాధ్యత వహించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. రాఫెల్ డీల్ విషయం ప్రజా ప్రాముఖ్యత సంతరించుకుంటే తప్ప రేటు విషయమై తాము అడగమని ధర్మాసనంలోని న్యాయమూర్తులు చెప్పారు. ప్రజలు తెలుసుకోవాల్సిన అంశమా కాదా అనే విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుందని,. నిజాలు తెలియకుండా, రాఫెల్ ధరల గురించి చర్చించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.