జాతీయ వార్తలు

సర్దుకుపోండి.... సీట్లు రానివారికి రాహుల్ హితవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: ‘అందరికీ న్యాయం చేస్తాం.. పొత్తులు ఉన్నందున సర్దుకుపోక తప్పదు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టికెట్లు లభించని తెలంగాణ సీనియర్ నాయకులకు సూచించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డితో మాట్లాడారు. జనగామ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని పొన్నాల లక్ష్మయ్య పట్టుపడుతున్న విషయం తెలిసిందే. అయితే పొత్తుల మూలంగా ఈ నియోజకవర్గాన్ని కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితికి కేటాయించారు. జనగాం నియోజకవర్గానికి తాను గత 35 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇప్పుడు దీనిని టీజేఎస్‌కు కేటాయించటం అన్యాయమని లక్ష్మయ్య చెప్పారు. దీనికి రాహుల్ స్పందిస్తూ ‘మీ వాదనను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాకు వివరించండి’ అని సూచించినట్లు చెబుతున్నారు. ఖమ్మం నియోజకవర్గాన్ని పొత్తుల మూలంగా మిత్రపక్షానికి ఇవ్వవలసి వచ్చిందని రాహుల్ పొంగులేటికి చెప్పినట్లు తెలుస్తోంది.