జాతీయ వార్తలు

ముష్టిఘాతాలు, తొక్కిసలాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 15: శ్రీలంక పార్లమెంటు ఎంపీల ముష్టిఘాతాలు, పరస్పరం దాడులు, చేతికందిన వస్తువులను విసిరేసుకోవడంతో తీవ్రగందరగోళంతో దద్దరిల్లింది. ప్రధాని విక్రమ్‌సింఘేను పదవి నుంచి తొలగించి రాజపక్సేను ఆ స్థానంలో అధ్యక్షుడు మైత్రీపాలసిరిసేన నియమించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో గురువారం పార్లమెంటులో బలపరీక్ష జరిగింది. ఈ బలపరీక్షలో రాజపక్సే ఓటమి చెందారు. దీంతో సభలో ఘర్షణ తలెత్తింది. అంతకుముందు రాజపక్సే ప్రభుత్వం ఓటమి చెందడాన్ని తిరస్కరిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రకటించారు. రాజపక్సేనే ఇప్పటిటీ ప్రధానమంత్రి అని సిరిసేన పేర్కొన్నారు. గురువారం పార్లమెంటు సమావేశం ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోడియంను రాష్టప్రతి మైత్రీపాల సిరిసేన, ప్రధాని రాజపక్సేకు మద్దతు ఇచ్చే ఎంపీలు చుట్టుముట్టి ఘెరావ్‌చేశారు. గురువారం శ్రీలంక పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సభలో సభ్యులు వాగ్వాదానికి, దాడులకు దిగారు. పార్లమెంటను రద్దు చేసి తాజగా ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు సిరిసేనకు మద్దతు ఇచ్చే ఎంపీలు డిమండ్‌చేశారు. యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన మా ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేను బలపరీక్షకు తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ కోరడంతో గొడవకు దారితీసింది. స్పీకర్ జయసూర్య ఫ్రీడమ్ పార్టీ సభ్యుడు రాజపక్సేను కూడా ప్రకటన చేసేందుకు అవకాశం ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంలో అప్పటికే రాజపక్సే ఓటమి చెందారు. తాను గతంలో అధ్యక్షుడిగా,ప్రధానిగా పనిచేశానని, 225 మంది ఎంపీలు తాజా ఎన్నికలకు సిద్ధపడాలని, ఈ డిమాండ్‌చేస్తామని ప్రతిపాదించారు. అనంతరం మూజు వాణి ఓటుతో విక్రమసింఘే ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన రాజపక్సే వర్గానికి చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను చుట్టుముట్టారు. స్పీకర్‌పై దౌర్జన్యం చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో ఒక ఎంపీకి గాయమై రక్తం కూడా కారింది. చేతికందిన వస్తువులను రాజపక్సే ఎంపీలు తీసుకుని స్పీకర్‌పైకి విసిరారు. ఈ తొక్కిసలాటలో దిలూమ్ అమునగా అనే ఎంపీకి గాయమైతే ఆస్పత్రికి తరలించారు. చివరకు స్పీకర్ మైక్రోఫోన్‌ను లాగేసుకున్నారు. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేశారు. కాగా అఖిలపక్ష సమావేశానికి రావాలని అధ్యక్షుడు పంపిన ఆహ్వానాన్ని విక్రమసింఘే పార్టీ ఎంపీలు తిరస్కరించారు. కాగా గత నెల 26 తేదీన అద్యక్షుడు సిరిసేన ప్రధాని విక్రమసింఘే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రాజపక్సేను ప్రధానిగా నియమించారు. పార్లమెంటు రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చెల్లదని కోర్టు ప్రకటించింది. దీంతో పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించగా, బలపరీక్షలో విక్రమసింఘే ప్రభుత్వం నెగ్గింది. ఈ ఈ ఎన్నికను గుర్తించడానికి అధ్యక్షుడు సిరిసేన నిరాకరించడంతో, రానున్న రోజుల్లో శ్రీలంక సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనపడుతోంది.