జాతీయ వార్తలు

విశ్వసనీయత లేని విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 15: విఫక్షాలు చత్తీస్‌గఢ్‌లోనూ దేశ వ్యాప్తంగానూ విశ్వసనీయత లేమిని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడిక్కడ ఆరోపించారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో రాజకీయ లబ్థిపొందే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యమట్టారు. నక్సలిజం దేశంలో చివరి కాలునుమాత్రమే మోపుకుని ఉందని అదికూడా వచ్చే నాలుగైదేళ్లలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా గురువారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. ఈనెల 20న చత్తీస్‌గడ్‌లో జరిగే ఎన్నికల కోసం జరిగే పార్టీ ప్రచార ర్యాలీల్లో పాల్గొనేందుకు సింగ్ ఇక్కడికి వచ్చారు. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని, ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఆ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోతోందని, ఇది పెళ్లి కూతురు లేకుండా చేసే పెళ్లి ఊరేగింపులా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే ఇక్కడి కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం బ్యాంకును మోసగించే ఓ పోస్ట్ డేటెడ్ చెక్‌లా ఉందన్నారు. అందులో పేర్కొన్న హామీలన్నీ దుస్సాధ్యమైన, అబద్ధాలతో కూడుకున్నవేనని అన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ గురించి హామీ ఇస్తోందని, ఐతే కర్నాటకలో ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రుణాలు చెల్లించలేని రైతులకు వారెంట్లు జారీచేసి అరెస్టులు చేయిస్తోందని తెలిపారు. అలాగే పేదరికం పోగొడతామంటూ చెప్పుకునే ఆ పార్టీ పాలనలోనే అత్యంత దారుణమైన పేదరికం తాండవించిందన్నారు. అలాగే 1969లో బ్యాంకులను జాతీయ చేశామంటున్న కాంగ్రెస్ నేతలు తద్వారా ఎంతమంది పేదప్రజలకు లబ్ధిచేకూర్చారో చెప్పాలని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. కాగా దేశంలో నక్సలిజం చివరి దశలో ఉందని, గతంలో 90 జిల్లాలో ప్రభావితం చేసిన నక్సల్స్ ఇప్పుడు 10నుంచి 11 జిల్లాలకే పరిమితమయ్యారని ఆయన చెప్పారు.
గతంలో అధిక సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సల్స్ చేతుల్లో మరణించేవారని, ఇప్పుడా పరిస్థితుల్లో పూర్తి మార్పువచ్చిందని, సమీప భవిష్యత్తులోనే నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. లొంగిపోతున్న నక్సల్స్‌కు మంచి పునరావాస పథకాలను అమలు చేస్తున్నామన్నారు.