జాతీయ వార్తలు

సీబీఐని మేమూ రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 16: దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఆర్‌బీఐ లాంటి వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు అనుమతిని నిరాక రించాలని నిర్ణయంచడాన్ని ఆమె ప్రకటించారు. తాము కూడా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోమని ఆమె తెలిపారు. ప్రజల సొమ్ముతో భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఉత్సవ విగ్రహంగా మారిపోవడం తథ్యమని ఆమె అన్నారు. ‘బీజేపీ హటావో.. దేశ్ బచావో’ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో మమతా బెనర్జీ ప్రసంగిస్తూ అన్ని రంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. బీజేపీ ప్రభుత్వం గేమ్ చేంజర్‌గా కాక నేమ్ చేంజర్‌గా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. తన స్వప్రయోజనాల కోసం ప్రతిదాని పేరు మార్చడం దేశానికి ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆర్‌బీఐ, సీబీఐ వ్యవహార్లో జోక్యం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఆ సంస్థల ఉనికికే ప్రమాదకరంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. తమ రాష్ట్రంలో సీబీఐ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. ‘చంద్రబాబు చేసింది కచ్చితంగా సరైనదే, సీబీఐ, ఇతర సంస్థలను ఉపయోగించుకుని తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది, దానిని ప్రతిఘటించాల్సిందే’ అని ఆమె వ్యాఖ్యానించారు. మందిర నిర్మాణం, జాతీయ పౌర రిజిస్టర్, విగ్రహం ఏర్పాటు, మత రాజకీయాలే ప్రధాన అజెండాగా వెళ్తున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్సవ విగ్రహంలా మిగిలిపోతుందని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు తమ టీఎంసీ పార్టీ పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 19న తాము అన్ని పార్టీలతో కలిసి నిర్వహించే ర్యాలీ రాజకీయాల్లో మేలు మలుపు అవుతుందని, ఈ ర్యాలీలో పాల్గొనడాకి ఏవో ఒకటి రెండు తప్ప చాలా విపక్ష పార్టీలు ఇప్పటికే సమ్మతిని తెలియజేశాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లలో ఘన విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నామని, కేంద్రంలో బీజేపీని అధికారంలోంచి దించడంలో కీలకపాత్ర పోషిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికారం పట్ల తమకు వ్యామోహం లేదని, కాని అధికారాన్ని ప్రజా సంక్షేమానికి ఎలా ఉపయోగించుకోవాలో తమకు బాబా తెలుసునని ఆమె అన్నారు. బీజేపీ కోట్ల నిధులున్న గొప్ప పార్టీ అని, తమది పేద పార్టీ అయినా తమ బలం మేరకు అసోం, ఒడిసా, ఝార్ఖండ్, త్రిపుర ఎన్నికల్లో పోటీ చేస్తామని మమతాబెనర్జీ చెప్పారు.
రైతులకు 7 వేల కోట్ల రుణాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి అరూప్ రాయ్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పుడు రైతుల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు నాలుగు శాతం నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్టు ఆయన చెప్పారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకులు విముఖత చూపుతున్న నేపథ్యంలో తామే రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.