జాతీయ వార్తలు

మిక్కీవౌస్‌కు తొంభై యేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: అందరినీ అలరించిన కార్టూన్ కేరెక్టర్ మిక్కీవౌస్ ఆవిర్భవించి తొంబై సంవత్సరాలైన సందర్భంగా వాల్ట్‌డిస్సీ సంస్థ ప్రపంచలోనే అతిపెద్ద మాస్ పార్టీ (సామూహిక ఉత్సవాలు)ని నిర్వహించాలని నిర్ణయించింది. మిక్కీవౌస్ తొలుత 1928లో ‘స్టీమ్ బోట్ విల్లే’ అనే కార్టూన్ సినిమాతో వెండితెరపై హోయలొలికింది. అప్పటి నుంచి ఈ ఎలుక పాత్రకు ప్రేక్షకుల్లో, ప్రత్యేకించి చిన్నపిల్లల్లో విపరీతమైన క్రేజ్‌ను ఏర్పడింది. ‘మా జీవితాల్లో ఈ పాత్రకూడా ఓ భాగంగా నిలిచింది.
కేవలం కంపెనీ పరిధిలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నామ’ని వాల్ట్ డిస్నీ కంపెనీ ఎంటర్‌ప్రైజ్ ప్రాన్‌చైస్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్ డానాజోన్స్ పేర్కొన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మా థీం పార్కులన్నింటిలో అతిపెద్ద సామూహిక పార్టీలు (ఉత్సవాలు) రెండు నెలలపాటు నిర్వహించ తలపెట్టామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మిక్కీపై అభిమానులు వారి సొంత ఇస్టాగ్రాం మూమెంట్‌ను సైతం పొందవచ్చన్నారు. ఇప్పటికే ఈ విషయంలో మంచి స్పందన వచ్చిందని, ప్రత్యేక ఆర్ట్‌తో కూడిన ఎన్నో చిత్రాలు ముచ్చటగొలుపుతున్నాయన్నారు. ప్రత్యేకించి తమ కంపెనీకి మంచి మార్కెట్ ఉన్న దేశాల్లో భారత దేశం కూడా ఒకటని, రెండేళ్ల క్రితం భారత్‌లో విడుదలైన ఓ చిన్న మిక్కీ కార్టూన్ హిందీ మాటలతో అలరించడం ముచ్చటగొలిపిందని, తన హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని మిక్కీ చాటిచెబుతోందని జోన్స్ చెప్పారు. 2017లో సుమారు 30 మిలియన్ మిక్కీవౌస్ ఉత్పత్తులు భారత దేశంలో అమ్ముడయ్యాయని, చిన్నపిల్లలు, యువకులను ఆకట్టుకోవడం కోసం ‘స్టే ఫిట్ విత్ మిక్కీ అండ్ మిన్నీ’ కార్యక్రమాన్ని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లోని మూడు వేల పాఠశాలల్లో డిస్నీ ప్రారంభించిందని తెలిపారు. కొత్త ఆలోచనా విధానాలతో సరికొత్త ఆవిష్కరణల కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మారుతున్న కాలాలకు అనుగుణంగా ఈ మిక్కీ క్యారెక్టర్‌ను కూడా మార్చేందుకు కృషి జరుగుతోందని జోన్స్ వివరించారు. ఇన్‌స్టాగ్రాంతోబాటు, ఫేస్‌బుక్ హాండిల్ కూడా తమ కంపెనీకి ఉందని తెలిపారు.