జాతీయ వార్తలు

దేశ భద్రత, శాంతిభద్రతలపై కాంగ్రెస్‌కు అలసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్ (మధ్యప్రదేశ్), నవంబర్ 16: దేశ భద్రత, శాంతి భద్రతలంటే కాంగ్రెస్‌కు పట్టవని, ఈ అంశం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం ఆ పార్టీకి అలవాటైందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భద్రత అంశాన్ని తేలికగా తీసుకుందన్నారు. ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడి విధ్వంసం సృష్టించారన్నారు. ఉగ్రవాదం నిర్మూలనకు నిర్దిష్టమైన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. 2016లో యూరి సెక్టార్‌పై దాడిలో 18 మంది సైనికులు మరణించారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌కు ధీటుగా బదులివ్వడమేకాకుండా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్నారు. కాంగ్రెస్‌కు దేశ భద్రత అంటే పట్టించుకోదని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడమే ఒక్కటే తెలుసన్నారు. ఉపాధి నిమిత్తం టీలు కూడా అమ్మిన నరేంద్రమోదీ స్వీయ కృషితో దేశ ప్రధాని స్థాయి వరకు చేరుకున్నారన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పేద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు.బీజేపీలో బాగాపనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో డిక్కీరాజా దిగ్విజయ్ సింగ్, మహారాజా జ్యోతిరాధిత్య సింధియా, పారిశ్రామికవేత్త కమల్‌నాథ్ ఉన్నారన్నారు. దేశంలో బాగా వెనకబడిన ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే బీజేపీ వల్లనేనన్నారు. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పేదలను ఆదుకునేందుకు తీసుకునే చర్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు సరైన అవగాహన లేదన్నారు. మధ్యప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలు బాగా జరిగిందంటే బీజేపీ వల్లనేనన్నారు. రైతాంగ సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. పేదలకు లబ్ధి చేకూరేందుకు కేంద్రంలో ఎన్డిఏ సర్కార్ తీసుకున్న ప్రణాళికలకు అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయన్నారు. అభివృద్ధి గురించి కాంగ్రెస్ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.