జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబికాపూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 16: ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే నిజంగా నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కుటుంబం వెలుపల ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా చేయగలరా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఒక ఛాయ్‌వాలా దేశ ప్రధాని కావడానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఆయన పై విధంగా స్పందించారు. ఎఐసీసీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని నియమించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నిరూపించినట్లవుతుందన్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన ఒక తల్లి కుమారుడు కూడా దేశ ప్రధాని అవుతారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారని, జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, నెహ్రూ విధానాల వల్లనే తాను ప్రధాని అయ్యానని కాంగ్రెస్ చెప్పడం తగదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న హంగామా అర్థరహితమన్నారు. నెహ్రూ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వ్యక్తులు అధికారంలో ఉన్నారని, వారు దేశానికి చేసిన సేవలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజంగా ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉంటే, ఐదేళ్ల పాటు ఎఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేతను నియమించి చూడాలన్నారు. నిజంగా ఇదే జరిగితే, నెహ్రూ ప్రజాస్వామ్యం చాలా గొప్పదని అంగీకరిస్తానన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనే గొప్ప విధానాన్ని దేశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదన్నారు. నాలుగున్నరేళ్లుగా తాను ప్రధాని పదవిలో ఉండడాన్ని కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారన్నారు. ప్రధాని కుర్చీలో టీలు అమ్ముకునే వాడు కూర్చోవడమేంటని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ దేశం ఒక కుటుంబం సొత్తు కాదన్నారు. ఈ దేశంలో పేదలు పడే కష్టాలు గాంధీ కుటుంబానికి తెలుసా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు తమకే ఉన్నట్లు గొప్పలు చెప్పుకునే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. దేశాన్ని చీకట్లో పెట్టి ప్రజాస్వామ్య హక్కులను అపహాస్యం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీన జరిగిన ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఓట్లు పోలుకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ పోలింగ్ నక్సలైట్లకు చెంపపెట్టు అని ఆయన అన్నారు. రెండవ దశ పోలింగ్‌లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.