జాతీయ వార్తలు

కొంత సమయమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెరచుకున్న అయ్యప్ప ఆలయం * తృప్తి దేశాయ్‌ని అడ్డుకున్న పోలీసులు, భక్తులు
శబరిమల/ పంబా (కేరళ), నవంబర్ 16: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రతిష్ఠాత్మకమయిన అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న తీర్పును అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించాలని శుక్రవారం నిర్ణయించింది. మరోవైపు, అయ్యప్ప ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు తెరిచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సందర్శన కోసం ఇప్పటి నుంచి రెండు నెలల పాటు ఆలయం తెరచి ఉంటుంది. శుక్రవారం ఆలయ తలుపులు తెరచుకున్న కొద్ది నిమిషాలకే తీర్పు అమలుకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలని అయ్యప్ప ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ (టీడీబీ) నిర్ణయించిందని బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ పంబాలో ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తానని ప్రకటించిన ‘్భమాత బ్రిగేడ్’కు చెందిన తృప్తి దేశాయ్ తన సహచరులయిన ఆరుగురు యువతులతో కలిసి కొచ్చికి చేరుకున్నారు. శుక్రవారం వేకువ జామునే వారు కొచ్చి విమానాశ్రయంలో దిగినప్పటికీ, వారిని విమానాశ్రయంలోనుంచి బయటకు రాకుండా అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు సుమారు 11 గంటల పాటు అడ్డుకున్నారు. కొచ్చి నుంచి తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు తనను కోరారని పుణేకు చెందిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ వెల్లడించారు.
రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులయిన మహిళలు ఆలయంలోకి ప్రవేశించొద్దని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీబీ నిర్ణయించినట్టు భావిస్తున్నారు. ‘వీలయితే రేపు లేదా సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తాం’ అని పద్మకుమార్ చెప్పారు. ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భక్తులను బోర్డు కోరిందని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తన దృఢ వైఖరిని ప్రకటించింది. అయితే, ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆ సమావేశాన్ని బహిష్కరించాయి.
అసాధారణ స్థాయిలో భద్రత
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో అయ్యప్ప ఆలయం వద్ద, పరిసర ప్రాంతాలలో అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత గత నెలలో, ఈ నెల మొదట్లో కొద్ది రోజుల కోసం ఆలయాన్ని తెరిచారు. రుతుస్రావ వయసులో ఉన్న కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పటికీ, భక్తులు, ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు.
శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రధాన పూజారి కండరారు రాజీవరు సమక్షంలో అయ్యప్ప ఆలయాన్ని తెరవడంతో అప్పటికే పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్న భక్తులు ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఆలయంలోకి ప్రవేశించారు. శీతల వాతావరణాన్ని లెక్క చేయకుండా భక్తులు ‘ఇరుమెడికెట్టు’తో ప్రధాన ఆలయమయిన సన్నిధానంకు వెళ్లేందుకు పవిత్రంగా భావించే 18 మెట్లు ఎక్కడానికి తొందరపడ్డారు. శబరిమల కొండలపై పెద్ద సంఖ్యలో భక్తులు వరుసక్రమంలో నిలబడి ఉండటం కనిపించింది. ఆలయం ‘మండల పూజ’ కోసం డిసెంబర్ 27 వరకు తెరిచి ఉంటుంది. ‘మకరవిలక్కు’ పండుగ కోసం తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు తెరిచి ఉంటుంది.