జాతీయ వార్తలు

నేడు తుది జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసనసభకు పోటీ చేసే మిగతా 19 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ప్రకటించారు. కుంతియా శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు న్యాయం చేస్తామని అన్నారు. జనగామ శాసనసభ టిక్కెట్ ఆశిస్తున్న పొన్నాల గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే సనత్‌నగర్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డికి కూడా న్యాయం జరుగుతుందని కుంతియా భరోసా ఇచ్చారు. 94 సీట్లకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇంతవరకు 75 సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 19 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను శుక్రవారం పూర్తి చేశారు. కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు కర్నాటక భవన్‌లో సమావేశమై తుది జాబితాను సిద్ధం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం ముద్ర వేసిన అనంతరం జాబితాను ప్రకటిస్తామని కుంతియా చెప్పారు. ఒక్కొక్క టికెట్ కోసం పది నుండి 40 మంది అభ్యర్థులు పోటీ పడటం వల్లే ఎంపిక కొంత ఆలస్యమైందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏర్పడటంతో టిక్కెట్ల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరగటం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని అన్ని వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. టిక్కెట్ల కోసం పోటీ పెరిగిపోవటంతో రాహుల్ గాంధీ శుక్రవారం కొందరు సీనియర్ నాయకులను పిలిపించి చర్చలు జరిపారని బోసురాజు చెప్పారు. రాహుల్ గాంధీ చర్చలు జరిపిన అనంతరం అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు
మిత్రపక్షాలకు కేటాయించే 25 సీట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చింది, జాబితా విడుదల చేసిన అనంతరం అన్ని అనుమానాలు తొలగిపోతాయని కుంతియా వివరించారు. వారం రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితర నాయకులంతా సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు.