జాతీయ వార్తలు

పగ్గాలిస్తే.. పది రోజుల్లో రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 17: చత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. దీని కోసం అవసరమైన నిధులు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ నుంచే లభిస్తాయని శనివారం ఇక్కడ ఓ ఎన్నికల సభలో స్పష్టం చేశారు. రెండోదశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించిన రాహుల్ పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని తూర్పారాబట్టారు. 2106లో మోదీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నష్టపోయిందని, కష్టాలపడ్డదీ సామాన్యులేనని విమర్శించారు. ధనికులను ఎలాంటి ఇబ్బంది కలగలేదని, నిజాయిపరులే అవస్థలకు గురయ్యారని అన్నారు. 3.5 లక్షల కోట్ల రూపాయల మేర సంపన్నుల రుణాలను మాఫీ చేసిన నరేంద్ర మోదీకి పేద రైతుల అవస్థలు పట్టలేదని ఆయన ధ్వజమెత్తారు.‘మోదీజీ రోజులు లెక్కపెట్టండి. రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే ప్రతి రైతు రుణాన్నీ మాఫీ చేస్తాం’అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. రుణమాఫీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని గత యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించే వారని గుర్తుచేసిన రాహుల్ ‘తాజా రుణాల మాఫీకి అవసరమైన నిధులు పారిశ్రామికవేత్తలైన మాల్యా, నీరవ్, అనిల్ అంబానీల నుంచే లభిస్తాయి’అని అన్నారు. వీరి నుంచి నిధులు తీసుకుని రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. బ్యాంకులకు దాదాపు 10వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా దేశం వదలి పారిపోయారని అలాగే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు 35వేల కోట్ల మేర బ్యాంకులను ముంచేశారని రాహుల్ విరుచుకుపడ్డారు. కోరియా జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. శుక్రవారం చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ శుష్కవాగ్దానాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. తమ పనితీరును చూసి ఓ కుటుంబం తెగ బాధపడిపోతోందని ఆయన గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. డిమోనిటైజేషన్ అమలుపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్‌గాంధీ ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాఫెల్ కుంభకోణం వెనక మోదీ ఉన్నారని, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 30వేల కోట్ల రూపాయల మేలు చేయడానికే కేంద్రం ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. 1000, 500 రూపాయల నోట్లు రద్దుచేసి దేశ ప్రజలను కష్టాలపాలు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనాన్ని నిరోధించడానికే డిమోనిటైజేషన్ తీసుకొచ్చామన్న మోదీ ప్రకటనను ఆయన ఖండించారు.‘మీ చర్యల వల్ల సంపన్నులకు ఎలాంటి ఇబ్బందీ గలగలేదు. సామాన్య ప్రజలే గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు’అని రాహుల్ విమర్శించారు. ఎక్కడైనా నగదు కోసం కోటీశ్వరులు బ్యాంకు బయట నిలబడ్డారా? అని ఆయన నిలదీశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏనాడూ విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు.గత యూపీఏ ప్రభుత్వం గిరిజన బిల్లు, ఆహార భద్రతాచట్టం, సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లును తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. కావాలంటే రికార్డులు తెప్పించుకుని చూడండి అంటూ మోదీకి ఆయన సవాల్ చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రమణ్‌సింగ్ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలుచేయలేదని ఆయన ధ్వజమెత్తారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీపై బీజేపీ నేతలు మాటతప్పారని ఆయన దుయ్యబట్టారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మోదీ వౌనం వహించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. గతంలో అవినీతిపై ఉపన్యాసాలు ఇచ్చే మోదీ ఇప్పుడు మిన్నకుండడానికి కారణమేమిటని ఆయన నిలదీశారు. సీఎం రమణ్‌సింగ్, ఆయన భార్యకు 36వేల కోట్ల రూపాయల సివిల్ సప్లయిస్ కుంభకోణంతో సంబంధం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బయటపడ్డ 5వేల కోట్ల రూపాయల చిట్‌ఫండ్ కుంభకోణం వెనకా బీజేపీ నేతలున్నారని ఆయన విమర్శించారు. పనామా పేపర్ల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ ఉన్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. అయినా సింగ్‌పై ఎలాంటి చర్యలూ లేవని ఆయన చెప్పారు. పనామా పేపర్స్ కుంభకోణంలోనే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలుకెళ్లాడని ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండదని రాహుల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్నదే అవినీతి పరులను కాపుకాయడానికని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.