జాతీయ వార్తలు

పొన్నాలదే జనగామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, యువ నాయకుడు సుధీర్ రెడ్డి తమ పంతం నెగ్గించుకున్నారు. లక్ష్మయ్య, సుధీర్ రెడ్డి వాదనతో ఏకీభివంచిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనగామ, ఎల్‌బీ నగర్ శాసనసభ సీట్లను ఇరువురు నాయకులకు కేటాయించారు. ఇదేవిధంగా తుంగతుర్తి ఎస్సీ టికెట్‌ను అద్దంకి దయాకర్‌కు ఇచ్చారు. అయితే తెలంగాణకు చెందిన మరో సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అడుగుతున్న సనత్‌నగర్, యువ నాయకుడు శ్రీ్ధర్ బాబు డిమాండ్ చేస్తున్న మల్కాజ్‌గిరి, వివాదాస్పద సికింద్రాబాద్‌తోపాటు మరో మూడు.. మొత్తం ఆరు సీట్లకు అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది. కాంగ్రెస్ అధినాయకత్వం శనివారం తెలంగాణ శాసనసభకు పోటీచేసే 13 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా చేసిన ప్రకటన ప్రకారం మొత్తం పందొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటించవలసి ఉంది. అయితే సనత్‌నగర్ నియోజకవర్గం విషయంలో మిత్రపక్షాలతో తలెత్తిని వివాదం కారణంగా ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్ల ప్రకటనను వాయిదా వేశారు, మిగతా ఆరు నియోజకవర్గాల పేర్లను ఎప్పుడు ప్రకటిస్తారనేది స్పష్టం కావటం లేదు. బోథ్ (ఎస్టీ) నియోజకవర్గం టికెట్‌ను సోయమ్ బాబురావు, నిజామాబాద్ అర్బన్‌ను
ఓ తాహెర్ బీం అమ్దాన్, నిజామాబాద్ గ్రామీణ సీటును డాక్టర్ రేకుల భూపతి రెడ్డికి ఇచ్చారు. బాల్కొండ టికెట్‌ను అనీల్ కుమార్‌కు కేటాయించగా, కార్వాన్‌ను ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రీకి ఇచ్చారు. ఎల్‌బీ నగర్ నుండి సుధీర్ రెడ్డిని రంగంలోకి దించితే యాకుత్‌పురా టికెట్‌ను కె.రాజేందర్‌రాజుకు ఇచ్చారు. యాకుత్‌పురా నుండి పోటీచేసే అవకాశం తనకు ఇవ్వాలంటూ రాజేందర్ రాజు రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ నివాసం ముందు రోడ్డుపై బైఠాయించిన విషయం తెలిసిదే. సికింద్రాబాద్ టికెట్ కావాలంటూ ధర్నా చేసిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి వ్యవహారాన్ని మాత్రం మరోసారి వాయిదా వేశారు. బహదూర్‌పురా టికెట్‌ను కలెం బాబకు ఇస్తే కొల్హాపూర్ టికెట్‌ను బీరం హర్షవర్దన్ రెడ్డికి ఇచ్చారు. కొల్హాపూర్ టికెట్‌కోసం తెలంగాణ బీసీ విభాగం అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్ తెలంగాణ భవన్‌లో నిరాహారదీక్షకు దిగడం తెలిసిందే. దేవరకొండ నుండి బాలు నాయక్‌ను బరిలోకి దించితే తుంగతుర్తి (ఎస్సీ) నుండి అద్దంకి దయాకర్‌ను పోటీ చేయిస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడు పొన్నాల లక్ష్మయ్య ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు. ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం టికెట్‌ను బానోత్ హరిప్రియ నాయక్‌కు కేటాయించారు.