జాతీయ వార్తలు

కుమారస్వామి నాయకత్వంపై కూటమి విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 24: గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన మరుసటి రోజు, శుక్రవారం కర్ణాటక మంత్రివర్గం ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్- జేడీ(ఎస్) కూటమి కొనసాగుతుందని నొక్కిచెప్పింది.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ కూటమి భాగస్వామ్య పక్షాల పరాజయాన్ని సమీక్షించడానికి రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఇక్కడ సమావేశమయింది. సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ గురువారం వెలువడిన ప్రజాతీర్పు కేంద్రంలో ప్రభుత్వానికి సంబంధించిందే తప్ప రాష్ట్రానికి సంబంధించింది కాదని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ కుట్రలను అధికార కూటమి వమ్ము చేస్తుందని పేర్కొన్నారు. ‘మేము ముఖ్యమంత్రి కుమారస్వామి నాయకత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశాం. అందరు మంత్రులు ఈ రోజు తీసుకున్న నిర్ణయమిది’ అని పరమేశ్వర అన్నారు. తమ కూటమి ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, కుమార స్వామి నాయకత్వంలో తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని, ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన పేర్కొన్నారు. గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 25 నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధించింది. దీంతో గత ఏడాది కాలం నుంచి కొనసాగుతున్న కుమార స్వామి ప్రభుత్వం స్థిరత్వం పట్ల అనుమానాలు అలుముకున్నాయి.