జాతీయ వార్తలు

లెఫ్ట్..రైట్ అబౌట్ టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: దేశంలో వామపక్ష పార్టీల పరిస్థితి అత్యంత దారుణగా తయారైంది. తాజా ఎన్నికల్లో సత్తాచాటలేక చతికిలపడ్డాయి. వామక్షాలకు బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ కనీస పోటీ ఇవ్వలేక పోయాయి. మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ప్రంట్ అభ్యర్థులకు డిపాజిట్లురాని పరిస్థితి. వామపక్ష చరిత్రలో ఇంత దయనీయమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. పేలవమైన ప్రదర్శనతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓటింగ్ షేర్ 23 శాతం ఉండేది. ఇప్పుడది ఏడు శాతానికి పడిపోయింది. అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు లెఫ్ట్‌ఫ్రంట్‌కు వచ్చిందటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తూర్పు రాష్ట్రాల్లో పోటీ చేసిన చోట కనీసం డిపాజిట్లుకూడా రాలేదు. 1952 తరువాత వామపక్ష కూటమి ఇంత పేలవమైన ప్రదర్శన చూపించడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఎక్కడా రెండంకెల ఫలితం రాలేదు. 2004 ఎన్నికల్లో 59 సీట్లు గెలుచుకున్న వామపక్షాలు, 2009లో 12 కంటే తక్కువ స్థానాలే దక్కాయి. 2014 ఎన్నికల్లో 12 సీట్లు వచ్చాయి. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయలేకపోవడం వల్లే రోజురోజుకూ దిగజారిపోతున్నట్టు విశే్లషకులు అంటున్నారు. ‘తాజా ఫలితాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. వైఫల్యాలపై సమీక్షించుకుని పార్టీలోకి యువరక్తం ఎక్కించాల్సి ఉంది. దేశంలో వామపక్ష కూటమి బలోపేతంపై దృష్టిసారిస్తాం’అని సీపీఐ నేత డీ రాజా స్పష్టం చేశారు. కేరళలో వామపక్ష కూటమి బలంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఎం నాయకత్వంలోలి లెఫ్ట్ డెమ్రోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అలప్పుఝాలో ఒక్కచోటే గెలిచింది. రివెల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్‌పీ) కొల్లం సీటును దక్కించుకుంది. ఇవి తప్ప రాష్ట్రంలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంది. కమలనాథులైతే ఖాతానే తెరవలేదు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి 34 ఏళ్లు నిరాటంకంగా అధికారం చెలాయించింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వామపక్షాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు గెలుచుకున్నారు. రాష్ట్రంలో 45 లోక్‌సభ స్థానాలున్నాయి. ఏ ఐదేళ్లలో కనీసం రెండోస్థానానికి కూడా లెఫ్ట్ ఎదగలేకపోయింది. తమ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వామపక్షాలు ఘోరంగా విఫలమవుతున్నాయని, ఎన్నికల్లో వైఫల్యానికి ప్రధాన కారణం ఇదేనని లెఫ్ట్ సిద్ధాంత కర్త, రచయిత ఛమన్‌లాల్ అన్నారు. 1990 నుంచి 2000 వరకూ సీపీఐ, సీపీఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ(ఎంఎల్), ఆర్‌ఎస్‌పీతో కూడిన వామపక్ష కూటమికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. రెండు రాష్ట్రాలు ఫ్రంట్ చేతిలో ఉండేవి. అలాగే 55-60 పార్లమెంట్ సీట్లు వామపక్షాల ఖాతాలో ఉండేవి.
1996-98లో థర్డ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో వామపక్షాలు కింగ్ మేకర్లే. 13 పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో లెఫ్ట్ కీలక భూమిక పోషించింది. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లోనూ మంచి పాత్రే పోషించారు. ఎప్పుడైతే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిందో వామపక్ష పార్టీలకు గడ్డుకాలం మొదలైంది. 2011లో వామపక్షాల చేతుల్లోంచి పశ్చిమ బెంగాల్ చేజారిపోయింది. తరువాత 2018లో త్రిపురలో బీజేపీ పాగా వేసింది. తాజాగా కేరళలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ ఓటింగ్ షేర్ 40.1 శాతానికి ఎగబాకింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా 39.7 శాతం నుంచి 43.5 శాతానికి పెంచుకుంది. పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మార్చుకోకపోవడం, ఎన్నికల్లో వ్యూహాలు పన్నడంలో ఘోర వైఫల్యం, ప్రాంతీయ పార్టీల ఆవిర్భవం ఈ పరిస్థితులకు కారణమని చెబుతున్నారు.