జాతీయ వార్తలు

తదుపరి ‘మహా’ సీఎం శివసేనకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 20: మహారాష్టల్రో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేవల పొత్తు కొనసాగుతుందనీ.. అయితే, ముఖ్యమంత్రి మాత్రం శివసేనకు చెందిన వారే ఉంటారని ‘సామన’ దినపత్రిక బుధవారం వెల్లడించింది. శివసేన అనుబంధ పత్రిక అయిన ‘సామన’ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ శివసేనకు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉంటుందని పత్రిక పేర్కొంది. వచ్చే ఏడాది జరగనున్న సామన 54వ వార్షికోత్సవ సభలో ముఖ్యమంత్రిగా శివసేనకు చెందిన అభ్యర్థి కూర్చొంటారని స్పష్టం చేసింది. సభలో ఉద్దవ్ థాకరేను తన పెద్ద సోదరుడిగా సీఎం ఫడ్నవిస్ పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కలిసి రానున్న శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి ఎవరౌతారన్నది ప్రధాన అంశమనీ, డిప్యూటీ సీఎం ఎవరన్నది తరువాత అంశమని పేర్కొంది. గత వారం ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి సుదీర్ ముంగన్‌తివారి మాట్లాడుతూ తరువాత సీఎం బీజేపీ అభ్యర్థే అవుతారని పేర్కొనగా.. యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేవాయ్ మాత్రం సీఎం పదవి రొటేషన్ పద్ధతిలో ఉంటుందని నొక్కి చెప్పారు. ఎన్నికల సర్దుబాటులో ఈ అంశాన్ని కచ్చితంగా శివసేన ప్రస్తావించి తీరుతుందనీ, అవసరమైతే రెండున్న సంవత్సరాల వంతున పంచుకోవాల్సి ఉంటుందని వరుణ్ చెప్పారు. పరివార్ సంస్థల ఎన్నికల పొత్తును అమిత్‌షా అంగీకరించారని కూడా వివరించారు.