జాతీయ వార్తలు

కీలక ఘట్టాలనే విస్మరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 11: భారత చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన, వౌలికమైన అంశాలను చరిత్రకారులు విస్మరించారని, వీటి గురించి సరైన అవగాహన లేకుండానే రాసేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకం సమున్నతమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడమేనని మోదీ ఉద్ఘాటించారు. కోల్‌కతాలోని వారసత్వ భవనాలైన కరెన్సీ బిల్డింగ్, బెల్వడార్ హౌస్, విక్టోరియా మెమోరియల్ హాల్‌లను శనివారం జాతికి అంకితం చేసిన సందర్భంలో మోదీ మాట్లాడారు. భారత దేశాన్ని సమున్నతమైన వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, నిరూపమానమైన వారసత్వ సంపద గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. బ్రిటీష్ కాలంలోనూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రాసిన దేశ చరిత్రలో కీలక ఘట్టాలను విస్మరించడం దురదృష్టకరమని మోదీ అన్నారు. ‘్భరత దేశ చరిత్ర అంటే పరీక్షలకు కోసం విద్యార్థులు చదివేది కాదు’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ 1903లో అన్న మాటలను మోదీ ఈ సందర్భంగా ఉటంకించారు. ఇతర ప్రాంతాల నుంచి భారత్‌కు వచ్చి అధికారం కోసం సొంత బంధువులను, సోదరులను చంపడమే భారత దేశ చరిత్ర కాదని రవీంద్రుడే స్వయంగా చెప్పారని మోదీ అన్నారు. ఆ సమయంలో భారత్ ప్రజల జీవన రీతులు ఎలా ఉన్నాయి?, ఈ చరిత్ర రాసేప్పుడు అసలు భారతీయులే లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయని మోదీ అన్నారు.
గంగా తీరంలోని మిలియనం పార్కు నుంచి సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. దాదాపు 2.5 నిమిషాల పాటు సాగే ఈ వ్యవస్థను మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఇక్కడి నుంచి ప్రధాని మోదీ రామకృష్ణ మఠం ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠానికి వెళ్ళారు.
'చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ