జాతీయ వార్తలు

వెనక్కి తీసుకోవాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్‌పీఆర్) ప్రక్రియను చేపట్టకూడదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో హోం శాఖ శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ తీర్మానం ఆమోదించడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యుసీ సమావేశానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని మోదీ ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని తీర్మానంలో ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు పూర్తి మద్ధతు ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి లోకం నోరు నొక్కేందుకు కేంద్రం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని తీర్మానంలో ఆరోపించారు. విద్యార్థుల వాదన వినేందుకు నిరాకరిస్తున్న మోదీ ప్రభుత్వం వారిని అణిచివేసేందుకు పోలీసుల చేత లాఠీ చార్జీ చేయిస్తోందని, బాష్ప వాయువు ప్రయోగిస్తోందని, బలవంతంగా అరెస్టులు చేయిస్తోందని, ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తూ ఉద్యమిస్తున్న విద్యార్థులపై దాడులు చేయిస్తోందని తీర్మానంలో ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేందుకు ఉద్యమిస్తున్న విద్యార్థులను దెబ్బ తీసేందుకు మోదీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోందని తీర్మానంలో ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న మోదీ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని తీర్మానంలో విమర్శించారు. విద్యార్థుల వాదన వినేందుకు కూడా నిరాకరించటం ద్వారా మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ తీర్మానంలో ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందుకే దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం విశ్వవిద్యాలయాలపై దాడులు చేస్తోంది, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తప్పుడు కేసులు పెడుతోంది, వీలున్న చోట వారిని అరెస్టు కూడా చేస్తోందని తీర్మానంలో ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇక మీదట విద్యార్థులతోకలిసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారను కాంగ్రెస్ తీర్మానంలో ప్రకటించారు.

'చిత్రం... ఢిల్లీలో శనివారం జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ