జాతీయ వార్తలు

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: భారత సైనిక దళాలు రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తాయి, రాజ్యాంగం ముందు మాటలో పొందుపరిచిన మూల సిద్ధాంతాలు, న్యాయం, సమానత్వం, సమాజ కూటమిని రక్షించేందుకు పోరాడుతుందని సైనిక దళాల అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ప్రకటించారు. ఈ నెల 15 తేదీన నిర్వహించే 72వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాతుతూ చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితి నెలకొన్నా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్దంగా ఉన్నదని తెలిపారు. పార్లమెంటు ఆదేశిస్తే పాక్ అక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు సైన్యం సిద్ధమేనని జనరల్ నరవాణే ప్రకటించారు. సైన్యం భారత ప్రజల వలన భారత ప్రజల కోసమని ఆయన స్పష్టం చేశారు. తన దృష్టి భారత సైన్యం విధేయత, విశ్వాసం, ఏకీకరణంపై కేంద్రీకరణమై ఉన్నదని ఆయన నరవాణే చెప్పారు. భారత సైన్యం ప్రతి సైనికుడు, అధికారి కూడా రాజ్యాంగానికి విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేస్తాడు, సైన్యం ప్రతి చర్యకు రాజ్యాంగానికి విధేయత అనేది మార్గదర్శనమని ఆయన ప్రకటించారు. సైనికులు, అధికారులకు అత్యంత నాణ్యమైన శిక్షణ ఇవ్వడం, అనుసంధానం చేయడం, సైనికులు, ఆయుధాల నాణ్యతను పతాక స్థాయికి పెంచేందుకు తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాణ్యత తప్ప పరిమాణం ముఖ్యం కాదంటూ ఈ మంత్రం ఆధారంగానే సైనిక దళాలను ఆధునీకీకరించటంతో పాటు భవిష్యత్ యుద్ధాలకు సిద్ధం చేస్తామని నరవాణే చెప్పారు. భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణను సైన్యానికి ఇప్పిస్తానని నరవాణే చెప్పారు. భవిష్యత్తులో యుద్ధాలు ముఖా-ముఖి ఉండవు, అవన్నీ అత్యాధునిక ఆయుధాలతో కూడి ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొనే విధంగా సైన్యాన్ని సిద్ధం చేయాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. భవిష్యత్ యుద్దాలు అత్యంత క్లిష్టంగానూ, నెట్‌వర్క్ సెంట్రిక్‌గా ఉంటాయన్నారు. ఇలాంటి యుద్ధాలను ఎదుర్కోవాలంటే మనం కూడా నెట్‌వర్క్ సెంట్రిక్‌గా మారిపోవాలి, పరిమాణం కంటే నాణ్యతను పెంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాణ్యత మంత్రంతో ముందుకు సాగుతామంటూ నాణ్యత లోపిస్తే పరిమాణం ఎంత పెద్దగా ఉన్నా ఫలితం ఉండదని ఆయన స్పష్టం చేశారు. యంత్రం వెనక ఉన్న మనిషి నాణ్యత ముఖ్యం, మన సైనికులు, అధికారులకు అత్యంత నాణ్యమైన శిక్షణ కల్పించటంతో పాటు వారి ఆశయ సిద్ది, అవసరాలను పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో పని చేస్తామని నరవాణే హామీ ఇచ్చారు. సైనం ప్రస్తుతం పరివర్తణ ప్రక్రియలో ఉన్నది, పరివర్తన పూర్తి అయిన తరువాత దీనిని గట్టిపరచుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. త్రివిధ దళాధిపతి పదవిని ఏర్పాటు చేయటం, ప్రత్యేక మిలిటరీ శాఖను ఏర్పాటు చేయటాన్ని నరవాణే పూర్తి స్థాయిలో బలపరిచారు. భవిష్యత్ సైనిక అవసరాల కోసం త్రివిధ దళాధిపతి, మిలిటరీ శాఖ ఏర్పాటు ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. త్రివిధ దళాల ఏకీకృతానికి త్రిదళాధిపతి పదవి ఏర్పాటు పెద్ద ముందడుగు అంటూ దీని విజయానికి తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని నరవాణే హామీ ఇచ్చారు. సైనిక దళాలలో కూడా సమీకృత విధానాన్ని అమలు చేస్తామంటూ ఏకీకృత, సమీకృత యుద్ధ సమూహాల ఏర్పాటు ఇందుకు ఉదాహరణమన్నారు. త్రివిధ దళాల అనుసంధానం ప్రక్రియలో అందరిని కలుపుకుపోతాము, ఏ ఒక్కరిని కూడా వెనక విడిచి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత దేశలో భూ భాగమని పార్లమెంటు గతంలో ఒక తీర్మానం చేయటం తెలిసిందే. పార్లమెంటు ఆదేశిస్తే పిఓకేను భారత చిత్ర పటంలోకి తెచ్చేందుకు సైన్యం సిద్ధమేనని జనరల్ నిరవాణే స్పష్టం చేశారు. సైన్యంలోకి మహిళలను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన ఒక ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. సరిహద్దుల్లో మహిళను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది, వంద మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు, అది పూర్తి కాగానే సరిహద్దులో మొహరించడం జరుగుతుందని జనరల్ నిరవాణే తెలిపారు. సియాచిన్‌ను ఎట్టి పరిస్థితిలోనైనా కాపాడుకుంటామన్నారు. సియాచిన్, సక్షగాం ప్రాంతంలో చైనా, పాకిస్తాన్‌ల భూభాగం కలుస్తుందంటూ ఈ రెండింటి మధ్య గొడవలు జరుగుతాయనే భ్రమ భారత సైన్యానికి ఉండకూడదని జనరల్ నరవాణే స్పష్టం చేశారు.
'చిత్రం... ఢిల్లీలో శనివారం జరిగిన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్మీ చీఫ్ నరవాణే