జాతీయ వార్తలు

మఠంలో రాజకీయ ప్రసంగాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 12: బేలూరు మఠంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏను ప్రస్తావిస్తూ మాట్లాడడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆక్షేపించింది. బేలూరు మఠం స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపమని, అలాంటి ప్రదేశాల్లో రాజకీయ ప్రసంగం చేయడం అనుచితమని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి దేశ భవిష్యత్ గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేసింది. సీఏఏ ద్వారా దేశాన్ని కుల, మత, వర్గ, ప్రాంతాల వారీగా విభజించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని టీఎంసీ ఆరోపించింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ఆదివారం మోదీ రాకను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఏఏను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెకు సంపూర్ణ మద్దతు ఇస్తామని టీఎంసీ నేతలు స్పష్టం చేశారు. ఇలావుంటే, కొన్ని ప్రాంతాల్లో పోలీసుల నిషేధాజ్ఞలను నిరసనకారులు ఉల్లంఘించారు. ప్రభుత్వ కార్యాలయాలవైపు దూసుకువెళ్తున్న కొంతమంది వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాగా, మమతా బెనర్జీ స్వయంగా ఈ నిరసనల ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.