జాతీయ వార్తలు

లాక్కోవడానికి కాదు.. ఇవ్వడానికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 12: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్ తదితర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న ఆయన బేలూరు మఠ్‌లోని రామకృష్ణ మఠంలో ఆదివారం విద్యార్థులతో మాట్లాడుతూ సీఏఏను తీసుకొచ్చింది పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు..ఇవ్వడానికేనని వ్యాఖ్యానించారు. ఈ చట్టం వల్ల దేశంలో ఉంటున్న ముస్లింలకుగానీ, ఇతరత్రా మైనారిటీలకు గానీ ఎలాంటి నష్టమూ ఉండదని స్పష్టం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనారిటీలు ఉన్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు ఇక్కడికి శరణార్థులుగా వస్తే, వారికి పౌరసత్వం ఇవ్వడంలో తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎవరి పౌరసత్వాన్నీ కేంద్రం హరించదని ఆయన అన్నారు. ‘మీకు తెలిసినంత కూడా సీఏఏ గురించి ప్రతిపక్షాలకు లేదు. ఎంత వివరణ ఇచ్చినప్పటికీ ఆయా పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడం మానలేదు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న వివిధ మతస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి పట్టడం లేదు. 70 సంవత్సరాలుగా తమ దేశంలో ఉన్న మైనారిటీలపై ఎందుకు వివక్ష చూపుతున్నారు అనే ప్రశ్నకు పాకిస్తాన్ సమాధానం చెప్పాలి’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని శనివారం తాను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని, అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. ఇలావుంటే, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా మోదీని కోరినట్టు మమత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ఇతోధిక ప్రాధాన్యత ఇస్తామని మోదీ స్పష్టం చేశారు. అక్కడి వారసత్వ సంపద అందరికీ గర్వకారణమని చెప్పారు. దేశ ప్రజల పౌరసత్వాన్ని హరించివేసే ఎలాంటి పనినీ కేంద్రం చేపట్టదని ప్రధాని తేల్చిచెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బేలూరు మఠ్‌లో ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, శనివారం ఇక్కడే నిద్రించడం తన పుణ్యమని మోదీ అన్నారు. బేలూరు మఠాన్ని ఆయన ఒక పుణ్యతీర్థంగా అభివర్ణించారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సొంత ఇంటికి తిరిగివచ్చిన ఆనందం కలుగుతుందని అన్నారు. సీఏఏపై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.
'చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ