జాతీయ వార్తలు

నడ్డాతో పవన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సోమవారం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో సమావేశమై సమాలోచనలు జరిపారు. దాదాపు అర గంట పాటు జరిగిన ఈ చర్చల్లో నడ్డా, పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని తీరు, ఆయన వ్యవహారం, రాష్ట్ర రాజధానిని అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదన, దీని పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న కోపతాపాలు, కొనసాగుతున్న ఉద్యమం తదితర అంశాలపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ జరుపుతున్న ఉద్యమం గురించి కూడా ఇరువురు నాయకులు చర్చించినట్లు
తెలిసింది. పవన్ కల్యాణ్ ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ గురించి నడ్డాకు ఫిర్యాదు చేశారనే మాట వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యల పట్ల కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని అంటున్నారు. ఆయన కొద్ది సేపు నడ్డాతో ముఖా-ముఖి చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మరి కొందరు నాయకులు నడ్డాను కలిసిన వారిలో ఉన్నారు.