జాతీయ వార్తలు

తుస్సుమన్న ప్రతిపక్షాల ఐక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశం తుస్సుమన్నది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలికే లక్ష్యంతో సోనియా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల కీలక సమావేశం ఏర్పాటు చేయ డం తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ప్రతిపక్షానికి చెందిన ఐదు ముఖ్యమైన పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆం ఆద్మీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీలు హాజరుకాకపోవటంతో సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశం నీరు కారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీఎస్‌పీ అధినాయకురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మహారాష్టల్రో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం
వహిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రతిపక్షాల సమావేశానికి గైర్హాజరు కావడంతో నరేంద్ర మోదీ, అమిత్ షాలపై సోనియా గాంధీ ఎక్కు పెట్టాలనుకున్న బాణం వీగిపోయింది. మమతా బెనర్జీ, మాయావతి, అరవింద్ కేజ్రివాల్ తదితర నాయకులు సోమవారం జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరై ఉంటే దీని ప్రభావం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉత్సాహపరిచేది. దీనితో పాటు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపించేది. మోదీ ప్రభుత్వంపై సమైక్య పోరాటానికి ప్రతిపక్షం సిద్ధమవుతోందనే సంకేతం వెళ్లేది. సోనియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని మమతా బెనర్జీ గత వారం నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రతిపక్షం సమావేశం నీరుకారిపోయింది. మమతా బెనర్జీ ప్రధానంగా వామపక్షాల మూలంగా ప్రతిపక్షం సమావేశానికి దూరంగా ఉండిపోయారు. ఢిల్లీ శాసన సభ సమావేశాల మూలంగా అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆం ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా కీలక పాత్ర నిర్వహించబోతోంది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు ఎక్కువ మంది దేశ రాజధాని ఢిల్లీలో శరణార్థులుగా ఉంటున్నందున ప్రతిపక్ష సమావేశానికి హాజరైతే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగులుతుందనే భయంతో ఆం ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయింది. ఇదిలాఉండగా బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి కొంత కాలం నుండి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇటీవల రాజస్తాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల మరణాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను విమర్శలతో ముంచెత్తడం తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిసి పని చేయకూడదనే ఆలోచనతోనే మాయావతి నేటి ప్రతిపక్షం సమావేశానికి హాజరు కాలేదు. ప్రతిపక్షానికి చెందిన నాలుగైదు ముఖ్యమైన, పలుకుబడి ఉన్న పార్టీలు దూరంగా ఉండటంతో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్షం సమావేశం నీరుకారిపోయింది.

'చిత్రం...ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మన్మోహన్, రాహుల్ తదితరులు