జాతీయ వార్తలు

అనుమానాల నివృత్తికి టీవీ చర్చకు వస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతోన్న అనుమానాలకు టీవీ చర్చ ద్వారా సమాధానం ఇవ్వగలరా? అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ.చిదంబరం ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ చేశారు. చిదంబరం సోమవారం ఈ మేరకు ట్వీట్ల యుద్ధం జరిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తున్న ఐదుగురు సృజనాత్మక విమర్శకులను ఎంపిక చేసుకుని వారు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని ఆయన నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ప్రధాని మోదీ ఆదివారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం మూలంగా దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వం కూడా రద్దు కాదని, ప్రతిపక్షాలు, ప్రజలు ముఖ్యంగా మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించటం తెలిసిందే. పాకిస్తాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న మైనారిటీ ప్రజలకు భారతీయ పౌరసత్వం కల్పించాలంటూ జాతిపిత మహాత్మా గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఉటంకించారు. చిదంబరం దీనిపై స్పందిస్తూ పౌరసత్వ సవరణ చట్టం మూలంగా దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని మీరు చెబుతున్నారు, అలాంటప్పుడు ఈ విషయంపై ఐదుగురు విమర్శకులతో టెలివిజన్ చర్చ జరిపేందుకు మీరు సిద్ధమేనా? అని చిదంబరం ఆయనకు సవాల్ చేశారు. మోదీ ఐదుగురు విమర్శకులను తానే ఎంపిక చేసుకోవచ్చునని కూడా చిదంబరం చెప్పారు. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి వేదికలపై నుంచి వౌనంగా ఉండే శ్రోతలతో మాట్లాడుతున్నారని, వారి నుంచి ఎలాంటి ప్రశ్నలను ఆయన స్వీకరించటం లేదని చిదంబరం ఎత్తిపొడిచారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీతో కలిపి సిఏఏను చూస్తే దీనిని అమలు చేస్తే చాలా మంది పౌరసత్వం రద్దు అవుతుందన్నది తమ అభిప్రాయమని చిదంబరం చెప్పారు. సీఏఏ అమల్లోకి వస్తే దేశంలోని చాలా మంది పౌరసత్వం లేనివారు అవుతారని ఆయన హెచ్చరించారు. పౌరసత్వం సవరణ చట్టంపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రధాని మోదీ ఎంపిక చేసిన ప్రముఖ విమర్శకులతో టీవీ చర్చ ఏర్పాటు చేసి విమర్శకులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజలు ఈ టీవీ చర్చను విని పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఒక అభిప్రాయానికి రావటం మంచిదని చిదంబరం అభిప్రాయపడ్డారు. సీఏఏను విమర్శిస్తున్న వారు ప్రధాని మోదీతో మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకోలేకపోతున్నారు, ప్రధాని కూడా విమర్శకులను కలుసుకుని వారి అనుమానాలను నివృత్తి చేయడం లేదని చిదంబరం విమర్శించారు. సీఏఏ విమర్శకుల అనుమానాల నివృత్తి జరగాలంటే నరేంద్ర మోదీ వారితో టెలివిజన్ చర్చ జరపటం ఒక్కటే దారి అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. సీఏఏ విషయంలో విమర్శకులతో టెలివిజన్ చర్చ జరపాలన్న తన ప్రతిపాదనను నరేంద్ర మోదీ ఆమోదిస్తారనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు.