జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడాన్ని విద్యార్థులకు వివరించగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశ ప్రజలను మతం ఆధారంగా విభజిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశం ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతున్నదో విద్యార్థులకు వివరించే ధైర్యం చేయగలరా? అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ చేశారు. రాహుల్ గాంధీ సోమవారం ప్రతిపక్ష నాయకుల సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక తదితర సమస్యల గురించి ఆయా విశ్వవిద్యాలయాల విద్యార్థులతో మాట్లాడే ధైర్యాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎందుకింత నిరుద్యోగం పెరుగుతోందనేది యువతకు వివరించగలిగే ధైర్యం నరేంద్ర మోదీకి ఉన్నదా? అని రాహుల్ ఆవేశంతో ప్రశ్నించారు. నరేంద్ర మోదీ తన భద్రత, ఇతర సిబ్బంది లేకుంతా ఏదైనా విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడగలుగుతారా? అని ఆయన సవాల్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం పట్ల యువతులు, ఇతర వర్గాల్లో ఆగ్రహం పెరిగిపోతోందని ఆయన చెప్పారు. పాలకులు దేశానికి మార్గదర్శనం చేయాలి కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బాధ్యతల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ కారణం చేతనే విద్యార్థులు, యువకులు, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోందని ఆయన వివరించారు. మోదీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా దేశాన్ని విభజించే పనిలో పడ్డారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశంలోని యువత వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను మోదీ ప్రభుత్వం ఆణచి వేస్తోందని ఆయన ఆరోపించారు. యువకులు, విద్యార్థులు ప్రస్తావిస్తున్న అంశాలు ఎంతో ముఖ్యమైనవి, వీటిని వినవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పించటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరోసారి పట్టాలు ఎక్కించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి కానీ అలా చేయటం లేదని ఆయన చెప్పారు. అన్ని మతాలు, వర్గాలకు చెందిన వేలాది మంది యువకులు ఇప్పుడు రోడ్డున పడతారు, వారి వాదనను విని పరిష్కరించాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉన్నదని రాహుల్ అన్నారు. దేశంలోని యువకులు, విద్యార్థులు, రైతులు, బడుగ, బలహీనవర్గాల వారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, ఉపాధి లేకపోడం పట్ల ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి పథంలో నడిచేందుకు దేశానికి లభించిన అవకాశాన్ని మోదీ ప్రభుత్వం చేజేతులా జారవిడుచుకున్నదని రాహుల్ గాంధీ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించటంతోపాటు ఆర్థిక వ్యవస్థను దారిలోకిఎలా తెస్తారనేది మోదీ దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

'చిత్రం... కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ