జాతీయ వార్తలు

నదుల అనుసంధానానికి రాష్ట్రాలు సహకరించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్ జనవరి 13: దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు అంతగా ‘సహకరించడం లేదు’ అని కేంద్ర జలశక్తి వనరుల శాఖ సహాయ మంత్రి రతన్‌సింగ్ కటారియా సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ‘ఓటు బ్యాంకు రాజకీయాలే’ ముఖ్య కారణమని కటారియా ఆరోపించారు. సోమవారం ఔరంగాబాద్‌లో జాతీయ వాటర్ మిషన్ నేతృత్వంలో జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్న అనంతరం మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని వారిపై ఒత్తిడి తేవాలని కేంద్రం అనుకోవడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ‘కేంద్ర ప్రభు త్వం నదుల అనుసంధానంపై చాలా పని చేసింది.. చాలా నదులను అనుసంధానం చేయాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదు’ అని మంత్రి కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. ‘చాలా రాష్ట్రాలకు మిగులు జలాలు ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాధినేతలు ప్రాజెక్టుకు అంగీకరించడం లేదు.. ఎందుకంటే వారి ప్రాజెక్టుకు అంగీకరిస్తే వారికి ఓట్లు ఎక్కడ రాకుండా పోతాయోనన్న భయమే కారణం అన్నారు. వర్క్‌షాపులో మంత్రి మాట్లాడుతూ మహారాష్టల్రోని మరఠ్వాడ లాంటి కరవు ప్రాంతాల్లో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను ఎక్కువగా వాడితే మంచిదని మంత్రి హితవు పలికారు. ‘్భమి సారాన్ని అనుసరించి పంటలు వేస్తే మంచిదని రైతులకు ఆయన హితవు పలుకుతూ దీనికి అవసరమైన సహాయం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు అందివ్వాల్సి ఉంటుందని’ సూచించారు. చెరకు, వరి సాగుకు నీటి అవసరం ఉంటుందనీ.. ఈ దృష్ట్యా తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసేందుకు హర్యానాలోని రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వీరికి అవసరమైన ప్రోత్సాహకాలను అందజేస్తోందని.. వీటిని రైతులు సద్వినియోగం చేసుకొంటున్నారని మంత్రి వివరించారు. పంటల విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కటారియా పేర్కొన్నారు. ఒక్క మహారాష్ట్ర విషయానికొస్తే ఇక్కడి జనాభాలో 55 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారనీ.. అయితే, ఇక్కడ 18 శాతం మాత్రమే సాగవుతోందని మంత్రి స్పష్టం చేశారు.