జాతీయ వార్తలు

18న సీఏఏ అనుకూల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఓపక్క దేశం అట్టుడుకుతుంటే.. ఈ చట్టానికి మద్దతుగా పాకిస్తాన్ నుంచి వచ్చిన 5వేల మంది భోవి హిందూ వలసవాదులు ఈనెల 18న దేశ రాజధాని ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనున్నారు. సీసీఏకు మద్దతుగా ర్యాలీని తలపెట్టినట్లు భోవి హిందూ సంస్థ జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ వౌర్య సోమవారం స్పష్టం చేశారు. సీఏఏకు మద్దతు తెలుపుతూ ఈనెల 18న జంతర్ మంతర్ నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వౌర్య పేర్కొన్నారు. భోవి కమ్యూనిటీలో ముఖ్యంగా వడ్డరలు, బోయర్‌లు, ఓదేలు దేశ వ్యాప్తంగా ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌లో జాతి వివక్షను ఎదుర్కొని భారత్‌కు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ శాతం మంది క్రషర్లలో పనిచేస్తున్నారు. వీరిని కొన్ని రాష్ట్రాలు ఎస్సీ జాబితాలో చేర్చాయి. ఈ రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం వీరు వెనుకబడిన తరగతుల జాబితాలో కొనసాగుతున్నారు. దేశ విభజన అనంతరం దాదాపు 22 లక్షల మంది భారత్‌కు పాకిస్తాన్‌ను వీడి వచ్చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం తమకు ఎంతో ఊరటనిచ్చిందని ఈ సందర్భంగా భోవి హిందూ తెగ జాతీయ అధ్యక్షుడు వౌర్య స్పష్టం చేశారు.