జాతీయ వార్తలు

జామియా వీసీ ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: జామియా మిలియా వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు అమానుష ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించననున్నట్టు వైస్ చాన్సలర్ నజ్మా అక్తర్ సోమవారం వెల్లడించారు. క్యాంపస్‌లో గతనెలలో పోలీసుల ప్రవర్తించిన తీరుకు నిరసనగా వందలాది మంది విద్యార్థులు ఆమెను ఘెరావ్ చేశారు. పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్టు అక్తర్ ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. పోలీసుల దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఇప్పటికే విచారణ ప్రారంభించిందని వీసీ వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి వెళ్లిందని, మంగళవారం మరో కమిటీ రానుందనని నజ్మా అక్తర్ విద్యార్థులకు చెప్పారు. కాగా కాలేజీ మెయిన్ గేట్ తాళంను విద్యార్థులు పగలగొట్టి వీసీ ఆఫీసుకు దూసుకొచ్చిన విద్యార్థులు నినాదాలు చేశారు. వీసీని ఘెరావ్ చేశారు, పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 15న సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మంగా మారింది. జామిగా క్యాంప్‌లోకి ప్రవేశించిన పోలీసులు విద్యార్థులపై విచ్చలవిడిగా తెగబడ్డారు. క్యాంపస్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తమపై దాడులకు దిగారని విద్యార్థులు ఆరోపించారు. గాయపడ్డ తమకు కనీసం వైద్యం కూడా అందకుండా అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లైబ్రరీ కిటికీలు ధ్వంసం చేసి మరీ తమను నిర్బంధించారని వారు చెప్పారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇలా ఉండగా క్యాంపస్‌లో జరిగిన పోలీసుల చర్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయం పరిశీలిస్తున్నట్టు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు సంబంధించి మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. జామియానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు కాపీని ఢిల్లీ సీపీ, డీసీపీకి అందజేశాం’అని వెల్లడించారు. దక్షిణ మండలి జాయింట్ సీపీ, క్రైం డీసీపీకి ఫిర్యాదు కాపీలు అందజేసినట్టు వర్సిటీ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాంపస్‌లో భద్రత ఏర్పాట్లు విస్తృతం చేయాలని, పరీక్షల తేదీలు మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డీన్స్, వివిధ శాఖల అధిపతులతో సంప్రదించిన తరువాత సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తేదీలపై ఓ నిర్ణయం తీసుకుంటామని వీసీ నజ్మా అక్తర్ హామీ ఇచ్చారు. క్యాంపస్‌లో హింస తరువాత హాస్టల్స్‌ను ఖాళీ చేయాల ని నోటీసులు ఇచ్చారని విద్యార్థులు చేసిన ఆరోపణలను వీసీ తోసిపుచ్చారు. ఎక్కడా అలాంటివి జరగలేదని అక్తర్ చెప్పారు. పోలీసులు రెచ్చిపోయి దాడులు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమని ఆర్కిటెక్ట్ విద్యార్థి సరుూద్ ఫహాద్, ఇంజనీరింగ్ విద్యార్థి ఆదిల్ వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, పోలీసుల జోక్యంపై వీసీ హామీ ఇవ్వాలని, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లా విద్యార్థి నౌషాద్ డిమాండ్ చేశారు.

'చిత్రం...ఢిల్లీలో సోమవారం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అఖ్తర్