జాతీయ వార్తలు

టీబీ నియంత్రణ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: క్షయ (టీబీ) వ్యాధిని నియంత్రించేందుకు భారత శాస్తవ్రేత్తలు అభివృద్థి చేసిన సరికొత్త సాంకేతికతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) దృవీకరించింది. ప్రధానంగా ట్యూబర్‌కులోసిస్ (టీబీ)ని ప్రాథమిక దశలోనే కనుగొనేందుకు, దాన్ని నివారించేందుకు బహుళ ఔషధ విధానంతో కూడిన నియంత్రణ చర్యలతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన డయాగ్నోస్టిక్ విధానాన్ని అనుసరించడాన్ని డబ్ల్యుహెచ్‌వో ప్రసంశించింది. ప్రపంచ టీబీ నియంత్రణ కార్యక్రమం ‘ట్రూనాట్ టీబీ టెస్ట్’లో ఈ సరికొత్త కణ పరీక్షా విధానాన్ని చేర్చుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనిద్వారా కేవలం 90 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, తద్వారా వెంటనే చికిత్సకు అవకాశం కలుగుతుందని తెలిపింది. ఈ విషయాలను డబ్ల్యుహెచ్‌ఓ తన ‘ల్యాబొరేటరీ మెడిసిన్ అండ్ పార్మకాలజీలో అనుసరించాల్సిన కణ పరీక్షలు, పరిశోధన’ అనే సమాచార డాక్యుమెంట్‌లో పొందుపరచింది.
కాగా ఇలా భారత చికిత్సకు సంబంధించిన సాంకేతికతను డబ్ల్యుహెచ్‌ఓ దృవీకరించడం వల్ల పేద, మధ్య స్థాయి ఆర్థిక స్థితికలిగిన దేశాలు సైతం ‘ట్రూనాట్’ విధానాన్ని టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు వినియోగించేలా తయారు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీబీని పారదోలేందుకు సైతం వీలుకలుగుతుందన్నారు.
‘ట్రూనాట్ అస్సే కిట్’ వాస్తవానికి ఇతర విధానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, పైగా దాన్ని సోలార్ పవర్ బ్యాటరీలతో కూడిన లైబ్రరీల్లో మాత్రమే (ఎయిర్ కండిషన్స్ లేకుండా) భద్రపరిచేందుకు వీలు కలుందన్నారు. ఈ కిట్ రెండు రకాలుగా పనిచేస్తుందని, తొలుత స్పుటమ్ (గళ్ల) నుంచి డీఎన్‌ఏను సేకరించడానికి, రెండో దశలో వ్యాధి తీవ్రతను గుర్తించి దానికి నివారణకు అనుసరించాల్సిన బహుళ ఔషధ చికిత్సా విధానాన్ని సూచిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ (డీహెచ్‌ఆర్) నేతృత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం మేరకు భారత శాస్తవ్రేత్తలు, కంపెనీలు అనేక విధాలైన సాంకేతికతలను టీబీ నివారణ కోసం కనుగొనగా అందులో ఈ విశిష్ట కిట్‌లను నిపుణులు ఎంపికచేసి దేశంలోని నాలుగు రెఫరల్ ప్రయోగశాలలకు పంపడం జరిగింది. చివరికి ‘ట్రూనాట్ ఎంటీబీ అండ్ రిఫ్’ అస్సేను అత్యున్నత ప్రమాణాలు కలిగిన విధానంగా ఎంపిక చేసినట్టు తెలిపారు. ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు జాతీయ టీబీ నివారణ కార్యక్రమంలో దీన్ని చేర్చడం జరిగింది.