జాతీయ వార్తలు

షిర్డి సాయి జన్మస్థల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిర్డి, జనవరి 18: షిర్డి సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వివాదస్పద ప్రకటన అలజడి రేపుతోంది. దీనికి నిరసనగా ఆదివారం బంద్ జరపాలని స్థానికులు పిలుపునిచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన షిర్డి సాయిబాబా జన్మస్థలం పర్బనీ జిల్లాలోని పత్రి ప్రాంతం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం తలెత్తింది. వెంటనే ఈ ప్రకటనను ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డి ప్రాంతంలోనే తన జీవితంలోని ఎక్కువ భాగాన్ని సాయిబాబా గడిపారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు వేలాదిగా రోజు వారీగా షిర్డి సాయిబాబా దర్శనానికి వస్తారన్న విషయం
తెలిసిందే. షిర్డిలోనే కాకుండా దాని పరిసర గ్రామాల్లోనూ బంద్ పాటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా భక్తుల కోసం ఆలయాన్ని తెరిచే ఉంచుతామని ఆలయ ట్రస్టు సీఇవో దీపక్ ముగాలికర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న స్థానికులు, నాయకులు ‘షిర్డి సాయిబాబా ఎక్కడ పుట్టారన్నది ఎవరికీ తెలియదు, అంత మాత్రాన పత్రి ప్రాంతమే ఆయన జన్మస్థలం అని చెప్పడానికి ఎంత మాత్రమూ వీల్లేదు’ అని స్పష్టం చేశారు. కాగా ఈ వివాదం శృతి మించకుండా సంబంధిత వర్గాలతో ముఖ్యమంత్రి థాక్రే సోమవారం చర్చలు జరుపుతారని ఆయన కార్యాలయం శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ ప్రకటన జారీ చేసింది.
'చిత్రం... షిర్డి సాయిబాబా