జాతీయ వార్తలు

కేంద్రం చూస్తూ ఊరుకోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయకుండా మూడు ముక్కలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిని అమరావతి నుంచి ఒక్క అంగుళం కూడా కదపలేరని ఆయన అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మూడు రాజధానుల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు జగన్‌కు లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. మూడు రాజధానుల వ్యవస్థ ఎంత మాత్రం మంచిది కాదని తాను హెచ్చరించినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం మూడు నగరాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం వౌనం వహించదని ఆయన హెచ్చరించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. జగన్‌కు ఇది తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో కానీ దీని వలన అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని సుజనా తెలిపారు. ఏపీ అధికారులు ముఖ్యమంత్రి జారీ చేసే ఆదేశాలను అమలు చేయవద్దని ఆయన సలహా ఇచ్చారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తప్పులు చేసిన అధికారులు పలు ఇబ్బందుల్లో పడ్డారని, కొందరు జైళ్లకు కూడా వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం కొత్త రాజధానిని ఒక చోట నిర్మించుకోవాలని సూచించిందే తప్ప రాజధానుల ఏర్పాటు గురించి చెప్పలేదని ఆయన అన్నారు. కొత్త రాజధానిగా అమరావతి నిర్మాణం కోసమే కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి కొంత డబ్బును విడుదల చేసిందని ఎంపీ స్పష్టం చేశారు. భూగర్భ డ్రైనేజీ కోసం 1000 కోట్లు విడుదల చేస్తే గత ప్రభుత్వం వినియోగ సర్ట్ఫికెట్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆయన చెప్పారు. రాజధానిలోనే శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఇతర భవనాలు ఉండాలని
వినజన చట్టం సూచిస్తుంటే జగన్ మాత్రం మూడు నగరాల్లో ఈ భవనాలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్భ్రావృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని, మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. రాజధాని ఏర్పాటు విషయంలో సీఎం జగన్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు సహించరన్నారు. కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించగా ‘ఆ సమయం ఇంకా రాలేదు. సరైన సమయంలో జోక్యం చేసుకుంటుంది’అని బదులిచ్చారు. జగన్ మూడు రాజదానుల ప్రతిపాదనపై ముందడుగు వేసినప్పుడు ఏం చేయాలనేది తమకు తెలుసునని ఆయన చెప్పారు. రాజధాని భూముల కొనుగోలులో ఏదైనా అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు చేయాలి తప్ప ఇలా బాధ్యత లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. భూముల విషయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

'చిత్రం... బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి