జాతీయ వార్తలు

భారతీయ వైశిష్ట్యానికి దివిటీ పట్టిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కంకణం కట్టుకున్న నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ‘్భరత సంస్కృతి, సంప్రదాయాలకు దివిటీ పట్టిన వ్యక్తి మోదీ’ అని శనివారం ఇక్కడ జరిగిన వేదాంత భారతి కార్యక్రమంలో ఆయన అన్నారు. భారతీయత గురించి, దాని విలువల గురించి ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మోదీ విశదీకరిస్తున్నారని అమిత్ షా తెలిపారు. ప్రధానమంత్రిగా పదవీ స్వీకారానికి ముందు నరేంద్ర మోదీ గంగా నదిలో పవిత్ర స్నానం చేశారని, అనంతరం వారణాసిలో జరిగిన గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారని అమిత్ షా గుర్తు చేశారు. భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేక పూజలు చేయాలని కోరుతూ నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయానికి తొలిసారిగా ఎర్ర చందనాన్ని పంపిన వ్యక్తి మోదీయేనని ఆయన తెలిపారు. గతంలో వచ్చిన ప్రతిపక్ష ప్రభుత్వాలు లౌకికవాదానికి వక్రభాష్యం చెప్పాయని పేర్కొన్న అమిత్ షా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా భారత్‌పై అన్ని దేశాల దృష్టి కేంద్రీకృతమైందని అన్నారు.